బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. నేడు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ప్రస్తుతం వర్షాలు కురవనున్నాయి.
ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత
ఆగ్నేయ బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) December 9, 2024
డిసెంబర్ 10 ,మంగళవారం :
• అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి మరియు వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.#AndhraPradesh #APSDMA pic.twitter.com/Muv2la3r3j
ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!
కోత కోసి ఉన్న రైతులు..
కోత కోసి పొలంలో ఉన్న పనలు వర్షానికి తడిచి గింజ మొలకెత్తకుండా ఉండేందుకు ఐదుశాతం ఉప్పు ద్రావణాన్ని పనలపై పిచికారీ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ చెప్పింది. అలాగే రైతులు పంట పొలాల్లో నిలిచే అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని.. ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే వాటి నివృత్తి కోసం మండల వ్యవసాయ అధికారిని సంప్రదించాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ చెప్పారు. ఇటీవల వచ్చిన తుపాను కారణంగా ఏపీలోని చాలా జిల్లాలలో పంట నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందు జాగ్రత్తగా సూచనలు చేసింది.
ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం