హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో మోహన్‌బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు నివాసం గేట్లను మనోజ్ తోసుకుంటూ లోపలికి వెళ్లడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో అక్కడి విషయాలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దైర్జన్యానికి పాల్పడ్డారు. వారి చేతుల్లోని మైకులను లాక్కొని ఆవేశంతో ఊగిపోయారు. ఆ మైక్‌లతో మీడియా ప్రతినిధులపైనే దాడి చేశారు. ఆపై ఆ మైకులను నేలకేసి కొట్టారు. ఈ దాడిలో ఓ కెమెరామెన్ కిందపడ్డారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు మోహన్ బాబును అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!
పోలీసులతో మౌనిక వాగ్వాదం
ఇదిలా ఉంటే మనోజ్ భార్య మౌనిక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అయింది. మనోజ్‌కు తీవ్రగాయాలయ్యాయని.. తన పిల్లలు, కుటుంబ సభ్యుల జోలికి వస్తే ప్రైవేట్ కేసు వేస్తానని అన్నారు. అంతేకాకుండా మనోజ్ సెక్యూరిటీని ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. తమ బౌన్సర్లను సైతం కానిస్టేబుళ్లు పంపించేశారని మండిపడ్డారు. పోలీసులు న్యాయంగా వ్యవహరించాలని ఆమె మాట్లాడిన మాటలు ఆ వీడియోలో స్పష్టంగా వినిపించాయి.
ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ఇంటి గేట్లు తోసుకుంటూ పోయిన మనోజ్
ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!
మోహన్ బాబు - మంచు మనోజ్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మనోజ్ తన భార్య మౌనికతో కలిసి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గట్టిగా అరుపులు అరిచారు. లోపల తన కూతురు ఉంది అంటూ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి
అయినా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తీయలేదు. దీంతో కాసేపు అక్కడే ఉన్న మంచు మనోజ్.. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి మోహన్ బాబు ఇంటి గేట్లు నెట్టుకుని లోపలికి ప్రవేశించారు. అదే సమయంలో మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. కాగా దాడి జరగడంతో చిరిగిన షర్ట్‌తోనే మనోజ్ బయటకు వచ్చారు.