ఆధ్మాత్మికత పేరుతో ఓ మత గురువు మైనర్ బాలికలపై దారుణానికి పాల్పడ్డాడు. శామ్యూల్ బాటెమ్యాన్ అనే మత నాయకుడు లైంగిక కోరికలు తీర్చుకోవడానికి దాదాపుగా 20 మంది మైనర్లను అక్రమంగా దిగుమతి చేసి ఆధ్యాత్మిక భార్యలుగా స్వీకరించాడు. చివరికీ ఈ నేరాలు చేశానని ఒప్పుకోవడంతో.. అమెరికా కోర్టు అతడికి 50 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత Samuel Bateman, a polygamous religious leader who has more than 20 spiritual “wives” including 10 underage girls, faces 20-50 years in prison for coercing girls as young as 9 years old to submit to criminal sex acts with him and other adults and transporting them across state… pic.twitter.com/9V9xdSiuiW — Art Candee 🍿🥤 (@ArtCandee) December 9, 2024 మైనర్ బాలికలను.. అమెరికాలో ఫండమెంటలిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ అనే ఒక ఫండమెంటలిస్ట్ గ్రూప్ ఉంది. ఇందులో మహిళలను గ్రూప్ సభ్యులుగా చేర్చుకుంటారు. మహిళలను చేర్చుకుని ఆధ్యాత్మిక భార్యలుగా పేర్కొన్నారు. ఈక్రమంలో శామ్యూల్ బాటెమ్యాన్ తనని తాను ఎఫ్‌ఎల్‌డీఎస్ ప్రవక్తగా ప్రకటించుకున్నారు. లైంగిక నేరాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి తన అనుచరులతో కొందరు మహిళలను అక్రమంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుని తన భార్యలుగా ప్రకటించుకునేవాడు. అసలు ఇవన్నీ కూడా చట్టపరంగా చేసేవారు కాదు. దీంతో 2022లో పోలీసులు శామ్యూల్‌ని అరెస్టు చేశారు. నిందితుడి నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో కూడా విచారణ చేశారు. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! అక్కడ 11-14 ఏళ్ల వయసున్న అనేక మంది మైనర్ బాలికలను పోలీసులు గుర్తించారు. అక్రమంగానే విదేశాల నుంచి బాలికలను రవాణా చేయగా కొందరిని కిడ్నాప్ చేశారు. విచారణలో వీటిని నిందితుడు అంగీకరించాడు. ఈ క్రమంలోనే అమెరికా కోర్టు అతనికి 50 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే ఒక్కో బాధితురాలికి ఒక మిలియన్ డాలర్ల నష్ట పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం