Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ బస్సు జనాలపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 29 మందికిపైగా గాయాలయ్యాయి. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

New Update
Road Accident..

Road Accident

Road Accident: ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ బస్సు జనాలపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.  

బ్రేక్ ఫెయిల్ కావడంతో..

Also Read:  చలికాలంలో పెసరపప్పు తినడం వల్ల కలిగే లాభాలు

వివరాల్లో వెళితే.. ముంబైలోని కుర్లా ప్రాంతంలో పాదాచారులపైకి బస్సు దూసుకురావడంతో ఐదుగురు మరణించగా.. మరో 29 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం కుర్లా పశ్చిమ రైల్వే స్టేషన్‌ రోడ్డులోని జరిగింది. గాయపడిన వారిని సియోన్, కుర్లా భాభా ఆస్పత్రికి తరలించారు. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బెస్ట్ రూట్ నంబర్ 332 బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికి వెళ్తుండగా బుద్ధకాలనీ సమీపంలోని అంబేద్కర్ నగర్‌లో ఈ ఘటన జరిగింది.

Also Read: TGPSC:  గ్రూప్ –2 ఎగ్జామ్‌ను వాయిదా వేయలేం–హైకోర్టు

వేగంగా వచ్చిన బెస్ట్ బృహన్​ముంబై ఎలక్ట్రిక్​ సప్లై అండ్​ ట్రాన్స్‌​పోర్ట్ బస్సు.. పాదచారులు, పలు వాహనాలను ఢీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన కనీష్ ఖాద్రీ(55), అఫ్రీన్ షా(19), ఆనం షేక్ (20), శివమ్ కశ్యప్(18)గా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. బస్సు డ్రైవర్ సంజయ్ మోరేను అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదానికి కారణం బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉడటంతోపాటు పెద్ద వాహనాన్ని అదుపు చేయలేకపోయాడని చెబుతున్నారు. అయితే బస్సు బ్రేకులు మంచిగా ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖకు చెందిన ఇన్స్​పెక్టర్ తెలిపారు. దీనిపై మరింత సమగ్ర విశ్లేషణ చేస్తామని భరత్ జాదవ్ వెల్లడించారు.

Also Read: హైదరాబాద్ ట్రాఫిక్ కోసం హెచ్‌‌– సిటీ

బెస్ట్ రూట్ నంబర్ 332లో ఎలక్ట్రిక్ బస్సు రాత్రి 9.30 గంటలకు కుర్లా స్టేషన్ నుంచి బయలుదేరి అంధేరి వెస్ట్‌​లోని అగార్కర్ చౌక్ వైపు వెళ్తోంది. సమారు100 మీటర్ల దూరం తర్వాత బస్సు రాంగ్ సైడ్‌లో​లో బైక్‌ , రెండు ఆటోలను ఢీకొట్టింది. వీటిల్లో ఒకటి పూర్తిగా ధ్వంసమైంది. రోడ్డుపై ఇద్దరు వ్యక్తులు చనిపోయి పడి ఉండటాన్ని చూసిన పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం  సమయంలో బస్సు నిండా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ప్రమాదంలో ఘటనలో కనీసం మరో ఐదుగురు తీవ్రంగా గాయాలయ్యాయి. స్థానికులు బస్సు అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీయటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Also Read:  బొప్పాయితో ఇలా చేస్తే చర్మ సమస్యలు ఉండవు

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు