భారత్-ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు..తొలిరోజు టికెట్లు సోల్డౌట్

మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబరు 26 నుంచి నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్‌ డే టెస్టు టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే తొలిరోజు ఆటకు టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి.

New Update
aus vs ind

బోర్డర్‌ గావస్కర్ ట్రోఫీ సిరీస్ ఊహించని రేంజ్‌లో నడుస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా భారత్ - ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. తొలి టెస్టు పెర్త్‌లో జరిగింది. ఈ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 295 పరుగుల తేడాతో ఆసీస్‌ ఓటమి పాలయ్యింది. 534 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఐదు టెస్టుల బీజీటీలో భారత్‌ జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Also Read: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

India v/s Australia Boxing Day Test

అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు అడిలైడ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 157 పరుగుల లీడ్ సంపాదించింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ను స్టార్ట్ చేసిన టీమిండియా పేవలమైన బ్యాటింగ్ చేసింది. ఈ రెండో టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Also Read: మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వలేము– సుప్రీంకోర్టు

ఇందులో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు టెస్ట్‌ సిరీస్‌లో 1-1తో సమం చేసింది. తొలి టెస్ట్‌లో అద్భుతమైన ఆటతీరుతో గెలుపొందిన భారత జట్టు.. సెకండ్ 
డే-నైట్‌ టెస్ట్‌లో అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ విఫలం అయింది. 

ఇక WTC ఫైనల్‌కు చేరాలంటే ఇరు జట్లకు ఈ సిరీస్ చాలా కీలకమనే చెప్పాలి. అందువల్ల ఈ సిరీస్ మున్ముందు మరింత ఉత్కంఠగా కొనసాగనుంది. ఇలాంటి మ్యాచ్‌ల కోసమే క్రికెట్ ఫ్యాన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) కోసం అంతా ఎదురుచూస్తున్నారు. మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ఈ నాలుగో టెస్టు స్టార్ట్ కానుంది. 

Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!

దీంతో ఈ బాక్సింగ్ డే టెస్టుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనికి సంబంధించిన టికెట్స్ తాజాగా ఓపెన్ కాగా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఈ స్టేడియం సామర్థ్యం లక్ష.. అయితే ఈ మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉండగానే తొలి రోజు ఆటకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం గమనార్హం. ఈ విషయాన్ని తెలియజేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 

ఇదిలా ఉంటే అడిలైడ్‌లో వేదికగా జరిగిన పింక్ బాల్‌ టెస్టుకు అభిమానులు భారీగా వచ్చారు. మూడు రోజుల్లో దాదాపు 1,35,012 మంది క్రికెట్ ప్రియులు స్టేడియంకి వచ్చారు. ఇకపోతే మూడో టెస్టుడిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్‌లో గబ్బా స్టేడియం వేదికగా జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు