Donald Trump: ట్రంప్ పాలకవర్గంలో మరో భారత సంతతికి చోటు

భారత సంతతికి చెందిన హర్మీత్ కె. ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చండీగఢ్‌కు చెందిన ఈమె చిన్నతనంలోనే ఫ్యామిలీ అమెరికలో స్థిర పడ్డారు.

New Update
Harmeet K. Dhillon

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్ట్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత సంతతికి చెందిన హర్మీత్ కె. ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నియమిస్తున్నట్లు సోషల్ మీడియ వేదికగా తెలిపారు. 

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

పౌర హక్కులను కాపాడేందుకు..

అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌లో సివిల్ రైట్స్ కోసం అసిస్టెంట్ అటార్నీ జనరల్‌గా హర్మీత్ కె. ధిల్లాన్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. పౌర హక్కులను కాపాడేందుకు ఎంతో కృషి చేశారని, కరోనా సమయంలో ప్రార్థనలు చేసుకోకుండా న్యాయపరంగా ఎంతో పోరాడన్నారు.

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

అగ్రశేణి న్యాయవాదుల్లో ఒకరైన ఆమె రాజ్యాంగ, పౌర హక్కులను, ఎన్నికల చట్టాలను అమలు చేయడంలో న్యాయంగా ఉంటారని నమ్ముతున్నానని ట్రంప్ పోస్ట్ చేశారు. భారత్‌లోని చండీగఢ్‌లో జన్మించిన హర్మీత్‌ కె.ధిల్లాన్‌ చిన్నతనంలోనే కుటుంబం అమెరికాకు వెళ్లి స్థిరపడింది. లా చదివిన ఆమె 2006లో సొంతంగా ధిల్లాన్‌ లా గ్రూప్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసుకుంది. 

ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Advertisment
తాజా కథనాలు