నాకు న్యాయం చేయండి ప్లీజ్ మీడియా ముందు మనోజ్ కన్నీళ్లు

మంచు ఫ్యామిలీ వివాదం పై మనోజ్ మొదటి సారి మీడియా ముందు స్పందించారు. తాను డబ్బు కోసమో ఆస్తి కోసమో ఈ పోరాటం చేయడం లేదని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. న్యాయం కోసం అందరినీ కలుస్తానని చెప్పారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని వాపోయారు.

New Update

Manchu Family: మంచు ఫ్యామిలీ వివాదం రోజు రోజుకు ముదురుతోంది. మరోసారి మంచు ఫ్యామిలీలో విభేదాలు తలెత్తడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.  ఆస్తి వివాదంలో కొడుకు మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. 

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

మీడియా ముందు స్పందించిన  మనోజ్.. 

ఈ వివాదం పై మనోజ్ మొదటి సారి మీడియా ముందు స్పందించారు. మనోజ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు తెలిపారు. నేను డబ్బు కోసమో, ఆస్తి కోసమో ఈ పోరాటం చేయడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. నేను న్యాయం కోసం అందరినీ కలుస్తాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగానే ఇలా చేయడం సరికాదని వాపోయారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్ భార్య మౌనిక పై కేసు నమోదైంది. మరోవైపు మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!

అందుకే నా పై ఆరోపణలు 

అయితే మోహన్ బాబు ఫిర్యాదు పై ఇప్పటికే మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని  క్లారిటీ ఇచ్చారు. తాను, తన భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నామని తెలిపారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.  విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని చెప్పారు. బాధితుల పక్షాన నిలబడినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఆర్థిక అవకతవకలు, దోపిడీకి సంబంధించి పూర్తి  ఆధారాలు తన వద్ద చాలా ఉన్నాయని" మనోజ్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు.

Also Read: మొత్తం బంగారమే.. శోభిత వెడ్డింగ్ చీర గురించి ఈ విషయాలు తెలుసా..?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు