మోహన్ బాబు - మంచు మనోజ్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లోని జల్ పల్లిలో మోహన్ బాబు ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మనోజ్ తన భార్య మౌనికతో కలిసి మోహన్ బాబు నివాసానికి చేరుకున్నారు. లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మనోజ్ గట్టిగా అరుపులు అరిచారు. లోపల తన కూతురు ఉంది అంటూ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!
అయినా సెక్యూరిటీ సిబ్బంది గేట్లు తీయలేదు. దీంతో కాసేపు అక్కడే ఉన్న మంచు మనోజ్.. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి మోహన్ బాబు ఇంటి గేట్లు నెట్టుకుని లోపలికి ప్రవేశించారు. అదే సమయంలో మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. కాగా దాడి జరగడంతో చిరిగిన షర్ట్‌తోనే మనోజ్ బయటకు వచ్చారు.
ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
ఇప్పటికే స్పందించి మనోజ్
ఈ వివాదం పై మనోజ్ ఇప్పటికే మీడియా ముందు మాట్లాడారు. మనోజ్ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు తెలిపారు. ‘‘నేను డబ్బు కోసమో, ఆస్తి కోసమో ఈ పోరాటం చేయడం లేదు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. నేను న్యాయం కోసం అందరినీ కలుస్తాను. నా బిడ్డలు ఇంట్లో ఉండగానే ఇలా చేయడం సరికాదు’’ అని వాపోయారు. ఇది ఇలా ఉంటే.. ఇప్పటికే మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనోజ్ భార్య మౌనిక పై కేసు నమోదైంది. మరోవైపు మనోజ్ ఫిర్యాదు మేరకు మోహన్ బాబు 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!
అందుకే నా పై ఆరోపణలు
అయితే మోహన్ బాబు ఫిర్యాదు పై ఇప్పటికే మనోజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. "తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ఆశపడలేదని క్లారిటీ ఇచ్చారు. తాను, తన భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నామని తెలిపారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!
విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నానని చెప్పారు. బాధితుల పక్షాన నిలబడినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని తెలిపారు. ఆర్థిక అవకతవకలు, దోపిడీకి సంబంధించి పూర్తి ఆధారాలు తన వద్ద చాలా ఉన్నాయని" మనోజ్ తన ఎక్స్ పోస్టులో తెలిపారు.