🔴Live Breakings: టీచర్‌ అనుమానాస్పద మృతి.. తీవ్ర గాయాలతో భర్త

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Viral Marriage: ఒక రాధ ఇద్దరు కృష్ణులు..ఆచారం అంటూ అన్నదమ్ములను పెళ్ళి చేసుకున్న మహిళ

హిమాచల్ ప్రదేశ్ లోని ఓ పెళ్ళి ఇప్పుడు నెట్టింట హల్ చల్ అవుతోంది. ద్రౌపది పాథ్ర అనే ఆచారం పేరుతో ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ములను పెళ్ళిచేసుకుంది. పైగా రెండు రోజుల పాటూ ఈ వివాహాన్ని వేడుకగా చేసుకున్నారు. 

బహు భార్యత్వం గురించి మనం చాలానే విన్నాం. ముఖ్యంగా ముస్తిం సమాజంలో ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ బహు భర్తృత్వం గురించి మాత్రం ఎక్కడా వినము. ఇతిహాసాల్లో ద్రౌపది మాత్రం ఐదుగురు అన్నదమ్ములను పెళ్ళి చేసుకుందని అందరికీ తెలిసిందే. అయితే ద్రౌపదిని ఇన్సిపిరేషన్ గా తీసుకుని కొన్ని తెగలు ఈ బహు భర్తృత్వాన్ని ఆచారంగా చేసుకున్నాయి. అయితే అయి ఉండొచ్చు కానీ అదెప్పుడో పూర్వకాలంలో ఇప్పుడు ఎవరు అలా చేసుకుంటారు అని అనుకుంటున్నారా.  అబ్బే లేదండీ..ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కొన్ని తెగలు ఈ ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళూ ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియలేదు. కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని షిల్లై అనే గ్రామంలో ఇలాంటి పెళ్ళి ఒకటి జరిగింది. అది కాస్తా వైరల్ అయి..సోషల్ మీడియాలోకి వచ్చింది. దాంతో దేశం మొత్తం ఈ వివాహం, వింత ఆచారాల గురించి తెలిసిపోయింది. 

Also Read :  KINGDOM: హిందీలో 'సామ్రాజ్య' పేరుతో రిలీజ్.. విజయ్ కొత్త పోస్టర్ వైరల్!

Also Read :  పవన్‌‌ ‘ఉస్తాద్’ షూటింగ్‌లో పాల్గొన్న హాట్ బ్యూటీ..!

వైరల్ అయిన వివాహం..

ఈ నెల జూలై 12 నుంచి 14 వరకు రెండు రోజుల పాటూ ట్రాన్స్-గిరి ప్రాంతంలోని షిల్లై గ్రామంలో జరిగి ఓ పెళ్ళి వేడుక వేలాది మందిని ఆకర్షించింది. ప్రభుత్వ ఉద్యోగి ప్రదీప్ నేకి, అతని తమ్ముడు కపిల్ ఇద్దరూ కున్హాట్ అనే గ్రామానికి చెందిన సేనీతా చౌహాన్ ను పెళ్ళి చేసుకున్నారు. రెండు రోజుల పాటూ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహం ఇప్పుడు సోషల్మీడియాలో ఓ హాట్ టాపిక్ అయింది.  ఈ ముగ్గురూ హిమాచల్ లోని హట్టి అనే తెగకు చెందిన వారు. ముగ్గురూ చదువుకున్నవారు. ఎవరి ఒత్తిడి లేకుండానే ఇష్టపూర్తిగానే పెళ్ళి చేసుకున్నారు. తల్లిదండ్రులను కూడా ఒప్పించామని చెబుతున్నారు. ఇది తమ తెగ ఆచారంలో భాగమని..దీని పేరు ద్రౌపది పాత్ర అని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా సిర్మౌర్, కిన్నౌర్, లాహౌల్-స్పితి వంటి జిల్లాల్లో..ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ ఆచారం కొనసాగుతోంది. చట్టప్రకారం దీనికి సమ్మతి లేదు కానీ భూమి సంరక్షణతో ముడిపడిన ఈ ఆచారం అంటే తమకు ఎంతో నమ్మకమని వధూవరులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 'జోడిదార్ చట్టం' కింద ఈ సంప్రదాయాన్ని గుర్తించిందని చెబుతున్నారు. 

ఇటీవలే షెడ్యూల్డ్ తెగ హోదా పొందిన హట్టిలకు.. సంప్రదాయాలు, ఆచారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఈ పెళ్ళి సంప్రదాయం కూడా ముఖ్యమైనది. దీని వలన  తరతరాలుగా వస్తున్న ఆస్తులను చెక్కుచెదరకుండా ఉంటాయని.. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో సామాజిక భద్రతను అందిస్తాయని హట్టి తెగ కుటుంబాలు చెబుతున్నాయి. 

Also Read: WCL Match: డబ్ల్యూసీఎల్ భారత్ , పాక్  మ్యాచ్ క్యాన్సిల్

Also Read :  డబ్ల్యూసీఎల్ భారత్ , పాక్  మ్యాచ్ క్యాన్సిల్..

LIVE BREAKINGS

  • Jul 20, 2025 15:41 IST

    20 ఏళ్లు కోమాలో ఉన్న సౌదీ ‘స్లీపింగ్‌ ప్రిన్స్‌’ కన్నుమూత

    సౌదీ యువరాజు అల్‌ వలీద్‌ బిన్ ఖలీద్‌ బిన్ (36) గత 20 ఏళ్లుగా కోమాలో ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఆయన కన్నుముశారు. గ్లోబల్ ఇమామ్స్‌ కౌన్సిల్ (GIC) ఈ విషయాన్ని ప్రకటించింది.

     

    Saudi's 'Sleeping Prince' Alwaleed Bin Khaled Dies After 20 Years In Coma
    Saudi's 'Sleeping Prince' Alwaleed Bin Khaled Dies After 20 Years In Coma

     



  • Jul 20, 2025 15:40 IST

    టీచర్‌ అనుమానాస్పద మృతి.. తీవ్ర గాయాలతో భర్త

    ఏలూరులో 35 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయురాలు మందాడ దేవిక అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆమె భర్త ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయిన సురేంద్ర కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలు ఉన్నాయి. స్థానికులు గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.



  • Jul 20, 2025 14:20 IST

    రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

    ఆదివారం ఒక్కరోజే భారత్, ఇరాన్, తజికిస్తాన్‌లో భూకంపాలు వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా భారీ భూకంపం సంభవించింది. 7.4 తీవ్రతతో రష్యా తీరంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.

     

    Tsunami warning after 2 large earthquakes off Russia's Pacific coast
    Tsunami warning after 2 large earthquakes off Russia's Pacific coast

     



  • Jul 20, 2025 13:28 IST

    ఉగ్రదాడికి ఆధారాలేవి.. టెర్రరిస్టులకు పాక్ బహిరంగ మద్ధతు

    ఇండియాలో పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతిచ్చింది. పాక్ పార్లమెంటులో మాట్లాడిన ఆ దేశ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్.. TRFను ఉగ్రసంస్థగా ప్రకటించడాన్ని ఖండించారు.

    Ishaq Dar chaired



  • Jul 20, 2025 12:43 IST

    సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!

    సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి తెలంగాణ ప్రభుతం రూ. కోటి నగదును బహుమతిగా ప్రకటించింది. ఈరోజు పాతబస్తీ బోనాల సందర్భంగా ఈ  పురస్కారాన్ని అనౌన్స్ చేశారు. 

     

    Rahul Sipligunj
    Rahul Sipligunj

     



  • Jul 20, 2025 12:42 IST

    తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 607 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇటీవల తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జులై 20) నుండి ప్రారంభమైంది.

     

    MHSRB Telangana Recruitment 2025
    MHSRB Telangana Recruitment 2025

     



  • Jul 20, 2025 12:37 IST

    కుక్క మంచి మనసు.. లేకదూడకు పాలిచ్చిన వీడియో వైరల్

    చిత్తూరు జిల్లా పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో ఓ వింత సంఘటన వెలుగుచూసింది. లేగదూడ కుక్క పాలు తాగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.. ఇది చూసిన వారంతా   ఆశ్చర్యానికి గురవుతున్నారు.

     

    calf drank dogs milk
    calf drank dogs milk

     



  • Jul 20, 2025 12:00 IST

    పేషెంట్ ప్రాణాలు తీసిన MRI స్కానింగ్ మెషిన్

    అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంటుండగా మృతి చెందాడు. MRI స్కానింగ్ కోసం మెషిన్‌లోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి బయటకు రాలేదు. మెడలో మెటల్ చైన్ ధరించడం వల్ల MRI మెషీన్‌లో రేడియేషన్ కారణంగా అందులోనే చనిపోయాడు.

    man died in MRI machine



  • Jul 20, 2025 11:44 IST

    వైసీపీకి మరో బిగ్‌షాక్.. అంబటి రాంబాబుకు పోలీసుల నోటీసులు

    వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. జగన్‌ రెంటపాళ్ల పర్యటన సమయంలో రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.

     

    Ambati Rambabu - YCP
    Ambati Rambabu - YCP

     



  • Jul 20, 2025 11:13 IST

    నా యో..* నా ఇష్టం: స్టార్ నటి షాకింగ్ రిప్లై!

    'నేచురల్ బర్త్‌ కాదు వెజీనాల్ బర్త్' అంటూ పోస్ట్ పెట్టి విమర్శలు ఎదుర్కొంటున్న నటి రిచా చద్దా మరోసారి రెచ్చిపోయింది. ‘నా పేజీ, నా యోని, నా బిడ్డ’ అంటూ నెటిజన్ల నెగిటివ్ కామెంట్లకు ఘాటుగా రిప్లయ్ ఇచ్చింది.

     

    Richa Chadha
    Richa Chadha

     



  • Jul 20, 2025 11:11 IST

    లేడీ ASIని చంపేసి.. పోలీస్ స్టేషన్‌లోనే లొంగిపోయాడు

    ఓ వ్యక్తి సహజీవనంలో ఉన్న ప్రియురాలిని చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. CRPF కానిస్టేబుల్ తన ప్రియురాలు అయిన అసిస్టెంట్ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ను హత్య చేసి.. ఆమె పని చేసే పోలీస్‌స్టేషన్‌లోనే లొంగిపోయిన ఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    CRPF Jawan Kills Woman ASI Lover



  • Jul 20, 2025 10:53 IST

    ఒక రాధ ఇద్దరు కృష్ణులు..ఆచారం అంటూ అన్నదమ్ములను పెళ్ళి చేసుకున్న మహిళ

    హిమాచల్ ప్రదేశ్ లోని ఓ పెళ్ళి ఇప్పుడు నెట్టింట హల్ చల్ అవుతోంది. ద్రౌపది పాథ్ర అనే ఆచారం పేరుతో ఒక మహిళ ఇద్దరు అన్నదమ్ములను పెళ్ళిచేసుకుంది. పైగా రెండు రోజుల పాటూ ఈ వివాహాన్ని వేడుకగా చేసుకున్నారు. 

     

    droupadi partha
    a woman in Himachal Pradesh's Sirmaur district married two brothers from the Hatti tribe.

     



  • Jul 20, 2025 10:52 IST

    లిక్కర్ స్కాం కేసు ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు.!

    వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో సిట్‌ అధికారులు ప్రిలిమినరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఇందులో జగన్ పేరు ప్రస్తావించారు. అయితే ఈ అభియోగపత్రంలో జగన్‌ను నిందితుడిగా చేర్చలేదు. ఇప్పటికి 40మంది ఉండగా తాజాగా మరో 8మందిని నిందితులుగా పేర్కొన్నారు.

    jagan chargesheet



  • Jul 20, 2025 10:51 IST

    సర్‌ప్రైజ్.. పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక - ఫోటోలు అదుర్స్!

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి చేసుకున్నట్లున్న AI ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ జంట తమ బంధాన్ని ధృవీకరించకపోయినా.. అభిమానులు AI టూల్స్‌తో వారి పెళ్లి చిత్రాలను సృష్టించి తమ ఆశలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.

    vijay and rashmika got married1



  • Jul 20, 2025 10:51 IST

    అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్..ఆరుగురు మావోయిస్టులు మృతి



  • Jul 20, 2025 10:50 IST

    HRతో రొమాన్స్ చేసిన CEO రాజీనామా

    కోల్డ్‌ప్లే కచేరీ "కిస్ కామ్" ఘటన నేపథ్యంలో, ఆస్ట్రోనమర్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ ఆండీ బైరన్ తన పదవికి రాజీనామా చేశారు. కంపెనీ హెచ్‌ఆర్ చీఫ్ క్రిస్టిన్ క్యాబోట్‌తో కలిసి ఆయన కచేరీలో కిస్ కామ్ కెమెరాకు చిక్కడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

    Andy Byron



  • Jul 20, 2025 10:50 IST

    భారతదేశంతో సహా 3 దేశాలలో భూకంపాలు.. గజగజ వణికిపోయిన జనాలు

    ఇవాళ మూడు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. భారతదేశంతో పాటు ఇరాన్, తజికిస్తాన్‌లో కూడా భూకంపాలు ప్రజలను వణికించాయి. ఈ మూడు దేశాలలో భూకంప తీవ్రత 2 నుండి 6 వరకు ఉంది. దీని కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా వెల్లడికాలేదు.



  • Jul 20, 2025 10:49 IST

    దేశమే ముఖ్యం..పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడేది లేదు..శిఖర్ ధావన్



  • Jul 20, 2025 10:49 IST

    ఫేక్ డాక్యుమెంట్లతో బంగ్లాదేశ్ ట్రాన్స్‌జండర్ అరెస్ట్

    బంగ్లాదేశ్‌కు చెందిన అబ్దుల్ కలాం అనే వ్యక్తి భారతదేశంలో దాదాపు పదేళ్లుగా 'నేహా' అనే ట్రాన్స్‌జెండర్‌గా మారువేషంలో జీవిస్తూ, నకిలీ గుర్తింపు పత్రాలతో భారత పౌరుడిగా చలామణి అవుతూ చివరకు భోపాల్‌లో అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

    Bangladeshi transgender



  • Jul 20, 2025 10:48 IST

    వాటర్ బాంబ్ పనులు ప్రారంభించిన చైనా

    ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని వల్ల సరిహద్దులోని అరుణాచల్‌, అస్సాం రాష్ట్రాలకు ముప్పు పొంచిఉంది. అందుకే కొంతమంది చైనా వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు.

    Yarlung Zangbo hydropower



  • Jul 20, 2025 10:47 IST

    బీహార్, ఉత్తరప్రదేశ్ లలో కుండపోత వర్షాలు..52 మంది మృతి

    నార్త్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. రుతుపవనాల ప్రభావంతో బీహార్, ఉత్తరప్రదేశ్ లలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో ఇప్పటి వరకు 52 మంది చనిపోయారు.



  • Jul 20, 2025 10:47 IST

    షాకింగ్ వీడియో.. గాల్లో ఉండగానే విమానంలో మంటలు..



  • Jul 20, 2025 10:46 IST

    పాముని పట్టుకున్న సోనూసూద్.. వీడియో వైరల్

    సోనూసూద్ ముంబయిలో తాను నివసించే సొసైటీలోకి వచ్చిన పామును చేతులతో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతేకాదు, ఆ పాము ర్యాట్‌ స్నేక్‌ అని, విషపూరితం కాదని వీడియోలో వివరించారు. ఆ వీడియోని ఆయన సొంత సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

     



  • Jul 20, 2025 10:46 IST

    IND Vs ENG: 4వ టెస్ట్ రబస.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రికార్డులపై కన్నేసిన రిషబ్ పంత్



Advertisment
Advertisment
తాజా కథనాలు