/rtv/media/media_files/2025/07/20/vijay-devarakonda-and-rashmika-got-married-photos-are-going-viral-2025-07-20-09-18-23.jpg)
vijay devarakonda and rashmika got married photos are going viral
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా వెల్లడించనప్పటికీ.. తరచుగా కలిసి కనిపించడం, ఒకే ప్రదేశాల్లో వెకేషన్లకు వెళ్లడం వంటివి ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని అందించాయి.
vijay and rashmika got married
ఇందులో భాగంగా తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్నట్లుగా ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసి చాలా మంది అభిమానులు ఆశ్చర్యపోయారు. నిజంగానే వీరు పెళ్లి చేసుకున్నారా? అని కొంతమంది సందేహాలు వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం ఇది AI ఫొటోలు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ, రష్మిక మంధాన్న వధూవరులుగా సాంప్రదాయ దుస్తులలో కనిపించారు. వారి మెడలో దండలు, రష్మిక నుదుట సిందూరం, విజయ్ షేర్వాణీ వంటివి పెళ్లి వాతావరణాన్ని తలపించేలా ఉన్నాయి. ఈ ఫోటోలు చూసి చాలా మంది అభిమానులు వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటే బాగుండు అని కోరుకుంటున్నారు.
ఇప్పటికే పలుమార్లు విజయ్, రష్మికలు తమ బంధం గురించి అడిగినప్పుడు ‘‘మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే’’ అని సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ.. వారు తరచుగా కలిసి కెమెరాకు చిక్కడంతో.. ఇద్దరి మధ్య డేటింగ్ వార్తలకు మరింత ఆజ్యం పోసింది. మొత్తానికి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి AI ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.