Ustaad Bhagat Singh: పవన్‌‌ ‘ఉస్తాద్’ షూటింగ్‌లో పాల్గొన్న హాట్ బ్యూటీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటి రాశీ ఖన్నా చేరింది. ఈ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్‌గా కనిపించబోతుంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది.

New Update
Raashii Khanna joined Pawan kalyan Ustaad Bhagat Singh movie

Raashii Khanna joined Pawan kalyan Ustaad Bhagat Singh movie

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు. గత ఎలక్షన్లకు ముందు సైన్ చేసిన చిత్రాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అన్ని పనులు పూర్తి చేసుకుని జూలై 24న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు పవన్ మరొక చిత్రాన్ని పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. 

Also Read: డైనోసార్‌ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు

Ustaad Bhagat Singh Movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరొక మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గబ్బర్ సింగ్' బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, 'ఉస్తాద్ భగత్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోలీసు పాత్రలో కనిపించనున్నారు. 

Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'

తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ  చిత్ర బృందంలో నటి రాశీ ఖన్నా చేరినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇందులో రాశీ ఖన్నా ప్రధాన కథానాయికలలో ఒకరిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇందులో రెండో హీరోయిన్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో శ్రీలీల ఇప్పటికే ప్రధాన హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 

Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్

రాశీ ఖన్నా.. పవన్ కళ్యాణ్ సరసన నటించడం ఇదే మొదటిసారి. ఇది ఆమె కెరీర్‌కు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకు కొనసాగనుందని సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు