/rtv/media/media_files/2025/07/20/earthquake-2025-07-20-14-13-46.jpg)
Tsunami warning after 2 large earthquakes off Russia's Pacific coast
ఈ మధ్య వరుసగా చాలా దేశాల్లో భూకంపాలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే భారత్, ఇరాన్, తజికిస్తాన్‌లో భూకంపాలు వచ్చాయి. తాజాగా రష్యాలో కూడా భారీ భూకంపం సంభవించింది. 7.4 తీవ్రతతో రష్యా తీరంలో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం కమ్చట్కా ద్వీపకల్పానికి సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ భూకంపానికి సంబంధించి ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు అధికారులు స్థానికులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు
Tsunami Warning After 2 Large Earthquakes
ఈరోజు భారత్, ఇరాన్, తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత 2 నుంచి 6 వరకు ఉంది. అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఉదయం 5 గంటల వరకు భూకంపం మూడు దేశాలలోనూ భయాందోళనలను రేకెత్తించింది. ఈ దేశాల్లో భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా వివరాలు వెల్లడికాలేదు. అయినప్పటికీ ప్రజలలో భయాందోళన వాతావరణం నెలకొంది.
Also Read: పేషెంట్ ప్రాణాలు తీసిన MRI స్కానింగ్ మెషిన్
భారతదేశంలోని అస్సాం రాష్ట్రం నాగావ్ జిల్లాలో మొదటి భూకంపం సంభవించింది. అర్థరాత్రి 12:56 గంటల ప్రాంతంలో భూకంపం భూమిని కుదిపేసింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.9గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి 40 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. తర్వాత.. తజికిస్తాన్‌లో భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం భూమికి 160 కిలోమీటర్ల లోతులో ఉంది. అలాగే ఇరాన్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో గుర్తించారు.
Also Read : ఆసక్తిరకర ఘటన.. పెట్రోలింగ్ చేస్తున్న ఏడుగురు పోలీసుల అదృశ్యం
Also Read : లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు
international | earthquake | rtv-news | telugu-news