/rtv/media/media_files/2025/07/20/sleeping-prince-alwaleed-bin-2025-07-20-15-19-27.jpg)
Saudi's 'Sleeping Prince' Alwaleed Bin Khaled Dies After 20 Years In Coma
సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్ (36) గత 20 ఏళ్లుగా కోమాలో ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. అయితే శనివారం ఆయన కన్నుముశారు. గ్లోబల్ ఇమామ్స్ కౌన్సిల్ (GIC) ఈ విషయాన్ని ప్రకటించింది. గతంలో ఓ ప్రమాదం జరిగిన తర్వాత ఆయన కోమాలోకి వెళ్లారు. దాదాపు 20 ఏళ్లుగా ఆయన కోమాలోనే ఉన్నారు. సుధీర్ఘ పోరాటం తర్వాత చివరికి శనివారం అల్ వలీద్ తుదిశ్వాస విడిచారు. అల్ వలీద్ తండ్రి ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ కూడా ఈ విషయాన్ని ఎక్స్‌లో చెప్పారు.
Also Read: దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
Also Read : సితార బర్త్ డే స్పెషల్.. మహేష్ బాబుతో ఫొటోలు వైరల్!
Saudi's Sleeping Prince Alwaleed Bin Khaled Dies
ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్ వలీద్ 1990 ఏప్రిల్‌లో జన్మించారు. ఆయన బ్రిటన్‌లోని ఓ మిలిటరీ కళాశాలలో చదువుతుండగా 2005లో ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యారు. ఆ తర్వాత కోమాలోకి వెళ్లారు. అనంతరం బ్రిటన్ నుంచి ఆయన్ని రియాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కోమాలోకి వెళ్లడంతో ట్యూబ్ ద్వారా ఆహారం అందించేవారు. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నా కూడా కోలుకునే ఛాన్స్ లేకపోవడంతో 2015లో దాన్ని తొలగించాలని వైద్యులు చెప్పారు. కానీ అల్ వలీద్ తండ్రి దీనికి నిరాకరించాడు. ఎప్పుడైన తన కొడుకు కోమాలోంచి ఎప్పుడైనా బయటికి రావొచ్చని భావించారు. దీంతో వైద్యులు అలాగే చికిత్స కొనసాగించారు.
Also Read: ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు
అయితే 2019లో వలీద్ ఓసారి చేతివేళ్లు కదిలించడం, తలను తిప్పడం లాంటివి చేశాడు. దీంతో ఆయన కోలుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ మళ్లీ ఎప్పట్లాగే ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇటీవలే అల్ వలీద్‌కు 36 ఏళ్లు వచ్చాయి. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో మద్దతుదారులు పోస్టులు చేశారు. చివరికి ఫలితం లేకుండా పోయింది.
Also Read : హిందీ భాష వివాదం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
saudi-arabia | rtv-news | telugu-news