/rtv/media/media_files/2025/07/20/crpf-jawan-kills-woman-asi-lover-2025-07-20-10-53-08.jpg)
CRPF Jawan Kills ASI Lover
ఓ వ్యక్తి సహజీవనంలో ఉన్న ప్రియురాలిని చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. CRPF కానిస్టేబుల్ తన ప్రియురాలు అయిన అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ను హత్య చేసి.. ఆమె పని చేసే పోలీస్‌స్టేషన్‌లోనే లొంగిపోయిన ఘటన గుజరాత్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కచ్ జిల్లాకు చెందిన CRPF కానిస్టేబుల్ దిలీప్ డాంగ్చియాకు 2021లో అదే ప్రాంతానికి చెందిన అరుణాబెన్ నతుభాయ్ జాదవ్‌తో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. అరుణాబెన్ అంజార్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐగా పని చేస్తుండగా.. దిలీప్ ప్రస్తుతం మణిపుర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు.
Also Read : ‘హరిహర వీరమల్లు’ కోసం పవన్ ఇంత కష్టపడ్డాడ.. మేకింగ్ వీడియో చూశారా?
CRPF Jawan Kills ASI Lover
CRPF जवान ने की महिला पुलिस कर्मी की हत्या
— Kaushik Kanthecha (@Kaushikdd) July 19, 2025
गुजरात के अंजार में #CRPF जवान ने अपनी प्रेमिका महिला पुलिस कर्मी जो अंजार पुलिस थाने में ASI पद पर तैनात हैं उससे कुछ बात को लेकर अनबन के चलते महिला कर्मी की किराए के घर में गला घोंट कर हत्या कर दी।#Gujarat#CRPF#Policepic.twitter.com/byXqh7ogPU
Also Read : లిక్కర్ స్కాం కేసు ఛార్జ్‌షీట్‌లో జగన్ పేరు.!
Also Read : షాకింగ్ వీడియో.. గాల్లో ఉండగానే విమానంలో మంటలు..
కొంత కాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. శుక్రవారం కూడా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన దిలీప్ ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. శనివారం ఉదయం ఆమె విధులు నిర్వర్తిస్తున్న పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. త్వరలో వారు వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారని.. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని పోలీసులు తెలిపారు. తన తల్లిని అరుణాబెన్ తీవ్రంగా దూషించడం తట్టుకోలేక ఆగ్రహంతో ఆమెను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
latest-telugu-news | surrender | gujarath | Kachchh | ASI Lover | CRPF Jawan