Pakistan: ఉగ్రదాడికి ఆధారాలేవి.. టెర్రరిస్టులకు పాక్ బహిరంగ మద్ధతు

ఇండియాలో పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతిచ్చింది. పాక్ పార్లమెంటులో మాట్లాడిన ఆ దేశ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్.. TRFను ఉగ్రసంస్థగా ప్రకటించడాన్ని ఖండించారు.

New Update
Ishaq Dar chaired

ఇండియాలో పహెల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతిచ్చింది. పాక్ పార్లమెంటులో మాట్లాడిన ఆ దేశ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్.. TRFను ఉగ్రసంస్థగా ప్రకటించడాన్ని ఖండించారు. పహెల్గాంగ ఉగ్రదాడిని ఖండిస్తూ యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ చేసిన ప్రకటనలో టీఆర్ఎఫ్ పేరు లేకుండా పాకిస్తాన్ అడ్డుకుందని దార్ చెప్పారు.

Also Read :  దారుణం.. టీచర్‌ అనుమానాస్పద మృతి.. తీవ్ర గాయాలతో భర్త

Pakistan Supported The Resistance Front

Also Read :  20 ఏళ్లు కోమాలో ఉన్న సౌదీ ‘స్లీపింగ్‌ ప్రిన్స్‌’ కన్నుమూత

'యూఎన్ఎస్‌సీ స్టేట్‌మెంట్‌లో టీఆర్ఎఫ్‌ పేరు రాకుండా అడ్డుకున్నాం. పలుదేశాల  నుంచి మాకు కాల్స్ వచ్చాయి. కానీ మేం తలొగ్గలేదు. చివరకు టీఆర్ఎఫ్‌ను ఆ ప్రకటన నుంచి తొలగించారు. పాక్ గెలిచింది' అని దార్ వెల్లడించారు. అలాగే తాము టీఆర్ఎఫ్‌ను ఇల్లీగల్‌గా పరిగణించబోమని స్పష్టంచేసిన ఆయన.. 'పహెల్గాం ఉగ్రదాడి చేసింది టీఆర్ఎఫ్ అని సాక్ష్యాలు చూపించండి. టీఆర్ఎఫ్ యాజమాన్యం ఎవరో చూపించండి. దానిపై వచ్చే ఆరోపణలను మేం అంగీకరించం.

Also Read :  దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

అందుకే యూఎన్ ప్రెస్ రిలీజ్ నుంచి టీఆర్ఎఫ్‌ను తొలగించాలని డిమాండ్ చేశాం' అని దార్ అన్నారు. పహెల్గాం దాడి చేసింది తామేనని టీఆర్ఎఫ్ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికితోడు భారత్, యూఎస్ నిఘా వర్గాలు కూడా టీఆర్ఎఫ్ పూర్తిగా లష్కర్-ఎ-తాయిబా అనుబంధ సంస్థ అని గుర్తించాయి. అయినా సరే పాకిస్తాన్ ఇలా బుకాయించడం గమనార్హం.

Also Read :  మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి

pakisthan | pahelgam terror | india | latest-telugu-news | The Resistance Front

Advertisment
Advertisment
తాజా కథనాలు