Kingdom: హీరో విజయ్ దేవరకొండ 'కింగ్డం' మూవీతో పవర్ ఫుల్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. జులై 31న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. అయితే హిందీ ప్రేక్షకుల కోసం 'సామ్రాజ్య' అనే పేరుతో హిందీ వెర్షన్ విడుదల చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ నిర్మాణ సంస్థ AA ఫిలిమ్స్ హిందీ డిస్ట్రిబ్యూషన్ రైట్ దక్కించుకున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ లో పోస్టర్ విడుదల చేశారు.
#Kingdom will now burn across Hindi screens as #Saamrajya 🔥#KingdomOnJuly31st@TheDeverakondapic.twitter.com/hDDHltojSo
— Telugu Film Producers Council (@tfpcin) July 19, 2025
'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సితార ఎంటర్ టైనమెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. ఇందులో విజయ్ జోడీగా భాగ్యశ్రీ హీరోయిన్ గా నటించగా.. సత్యదేవ్, కౌశిక్ మహతా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. విజయ్- సత్యదేవ్ అన్నదమ్ములుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే వీరిద్దరి బంధం నేపథ్యంలో విడుదలైన ''అన్నా అంటే''.. సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో పాటు ఇటీవలే విడుదలైన రిలీజ్ డేట్ ప్రోమో కూడా భారీ హైప్ క్రియేట్ చేసింది.
అనిరుధ్ మ్యూజిక్
విజయ్ దేవరకొండ ఓ పక్క పోలీస్ కానిస్టేబుల్ గా, మరోవైపు ఖైదీ గా భిన్నమైన షేడ్స్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. ఇంటెన్స్ డ్రామా, హై యాక్షన్ సీక్వెన్సెస్ ఫ్యాన్స్ లో జోష్ నింపాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరో హైలైట్ గా నిలవబోతుందని తెలుస్తోంది. 'గీతగోవిందం' తర్వాత విజయ్ కి సరైన హిట్ పడి చాలా కాలమైంది. రీసెంట్ గా వచ్చిన లైగర్, ఫ్యామిలీ స్టార్, ఖుషీ యావరేజ్ అనిపించాయి. దీంతో 'కింగ్డమ్' కోసం ఆసక్తిగా ఉన్నారు విజయ్ ఫ్యాన్స్.
Also Read: సర్‌ప్రైజ్.. పెళ్లి చేసుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక - ఫోటోలు అదుర్స్!