/rtv/media/media_files/2025/07/20/mhsrb-telangana-recruitment-2025-2025-07-20-12-36-13.jpg)
MHSRB Telangana Recruitment 2025
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) ఇటీవల తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు (జులై 20) నుండి ప్రారంభమైంది.
Also Read: డైనోసార్ అస్థిపంజరానికి వేలంలో రూ.260 కోట్లు
పోస్టుల వివరాలు
మొత్తం ఖాళీలు: 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.
మల్టీ జోన్ 1 లో 379 పోస్టులు
మల్టీ జోన్ 2 లో 228 పోస్టులు
Also read: 'ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!'
గైనకాలజీ విభాగంలో 90 పోస్టులు, జనరల్ సర్జరీ 43, జనరల్ మెడిసిన్ 47, రేడియో డయాగ్నసిస్ 21, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 21, అనస్తీషియా 44, పీడియాట్రిక్స్‌లో 28, బయోకెమిస్ట్రీ 18, ఫిజియాలజీ 29, ఫార్మకాలజీ 28, ఫోరెన్సిక్ మెడిసిన్ 21, కమ్యూనిటీ మెడిసిన్ 25, ఎమర్జెన్సీ మెడిసిన్ 15, సీటీ సర్జరీ 14, అనాటమీ 22, మైక్రోబయాలజీ 15, పాథాలజీ 15, ఆర్థోపెడిక్స్ 12 పోస్టులతోపాటు మరికొన్ని విభాగాల్లోనూ భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: జూలై 20, 2025 (నేడు).
దరఖాస్తు చివరి తేదీ: జూలై 27, 2025.
అధికారిక వెబ్‌సైట్: అర్హులైన అభ్యర్థులు https://mhsrb.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము: రూ. 500 (ప్రాసెసింగ్ ఫీజు అదనం).
Also Read : ఇజ్రాయెల్, సిరియా మధ్య కాల్పుల విరమణ
అర్హతలు:
మెడికల్ విద్యలో పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ కోర్సు చేసి ఉండాలి.
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకున్నవారు అర్హులు.
గవర్నమెంట్ హాస్పిటల్‌లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వర్క్ చేసినవారు ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ పెట్టుకోవచ్చు.
వయోపరిమితి:దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 46 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ:అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష ఉండదు. పీజీ మార్కులు, వెయిటేజీ మార్కుల ఆధారంగా పాయింట్స్ కేటాయిస్తారు.
Also Read : వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్
వేతనం: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల ప్రకారం రూ.68,900 నుంచి రూ.2,05,500 వరకు వేతనం ఉంటుంది.
రాష్ట్రంలోని 34 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది కొరతను తీర్చడానికి ఈ నియామకాలు చేపడుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం వైద్య కళాశాలల్లోని సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నియామకాలను చేపట్టింది.
assistant professors | ts-jobs | telangana-jobs