/rtv/media/media_files/2025/07/20/droupadi-partha-2025-07-20-10-11-06.jpg)
a woman in Himachal Pradesh's Sirmaur district married two brothers from the Hatti tribe.
బహు భార్యత్వం గురించి మనం చాలానే విన్నాం. ముఖ్యంగా ముస్తిం సమాజంలో ఇది ఎక్కువగా ఉంటుంది. కానీ బహు భర్తృత్వం గురించి మాత్రం ఎక్కడా వినము. ఇతిహాసాల్లో ద్రౌపది మాత్రం ఐదుగురు అన్నదమ్ములను పెళ్ళి చేసుకుందని అందరికీ తెలిసిందే. అయితే ద్రౌపదిని ఇన్సిపిరేషన్ గా తీసుకుని కొన్ని తెగలు ఈ బహు భర్తృత్వాన్ని ఆచారంగా చేసుకున్నాయి. అయితే అయి ఉండొచ్చు కానీ అదెప్పుడో పూర్వకాలంలో ఇప్పుడు ఎవరు అలా చేసుకుంటారు అని అనుకుంటున్నారా. అబ్బే లేదండీ..ఇప్పటికీ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కొన్ని తెగలు ఈ ఆచారాన్ని పాటిస్తూనే ఉన్నాయి. అయితే ఇన్నాళ్ళూ ఈ విషయం ఎవరికీ పెద్దగా తెలియలేదు. కానీ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని షిల్లై అనే గ్రామంలో ఇలాంటి పెళ్ళి ఒకటి జరిగింది. అది కాస్తా వైరల్ అయి..సోషల్ మీడియాలోకి వచ్చింది. దాంతో దేశం మొత్తం ఈ వివాహం, వింత ఆచారాల గురించి తెలిసిపోయింది.
Also Read : నా యో..* నా ఇష్టం: స్టార్ నటి షాకింగ్ రిప్లై!
వైరల్ అయిన వివాహం..
ఈ నెల జూలై 12 నుంచి 14 వరకు రెండు రోజుల పాటూ ట్రాన్స్-గిరి ప్రాంతంలోని షిల్లై గ్రామంలో జరిగి ఓ పెళ్ళి వేడుక వేలాది మందిని ఆకర్షించింది. ప్రభుత్వ ఉద్యోగి ప్రదీప్ నేకి, అతని తమ్ముడు కపిల్ ఇద్దరూ కున్హాట్ అనే గ్రామానికి చెందిన సేనీతా చౌహాన్ ను పెళ్ళి చేసుకున్నారు. రెండు రోజుల పాటూ అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహం ఇప్పుడు సోషల్మీడియాలో ఓ హాట్ టాపిక్ అయింది. ఈ ముగ్గురూ హిమాచల్ లోని హట్టి అనే తెగకు చెందిన వారు. ముగ్గురూ చదువుకున్నవారు. ఎవరి ఒత్తిడి లేకుండానే ఇష్టపూర్తిగానే పెళ్ళి చేసుకున్నారు. తల్లిదండ్రులను కూడా ఒప్పించామని చెబుతున్నారు. ఇది తమ తెగ ఆచారంలో భాగమని..దీని పేరు ద్రౌపది పాత్ర అని చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా సిర్మౌర్, కిన్నౌర్, లాహౌల్-స్పితి వంటి జిల్లాల్లో..ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా ఈ ఆచారం కొనసాగుతోంది. చట్టప్రకారం దీనికి సమ్మతి లేదు కానీ భూమి సంరక్షణతో ముడిపడిన ఈ ఆచారం అంటే తమకు ఎంతో నమ్మకమని వధూవరులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు 'జోడిదార్ చట్టం' కింద ఈ సంప్రదాయాన్ని గుర్తించిందని చెబుతున్నారు.
Also Read : లేడీ ASIని చంపేసి.. పోలీస్ స్టేషన్‌లోనే లొంగిపోయాడు
ఇటీవలే షెడ్యూల్డ్ తెగ హోదా పొందిన హట్టిలకు.. సంప్రదాయాలు, ఆచారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఈ పెళ్ళి సంప్రదాయం కూడా ముఖ్యమైనది. దీని వలన తరతరాలుగా వస్తున్న ఆస్తులను చెక్కుచెదరకుండా ఉంటాయని.. ముఖ్యంగా ప్రతికూల పరిస్థితుల్లో సామాజిక భద్రతను అందిస్తాయని హట్టి తెగ కుటుంబాలు చెబుతున్నాయి.
Also Read: WCL Match: డబ్ల్యూసీఎల్ భారత్ , పాక్ మ్యాచ్ క్యాన్సిల్..
Also Read : హిందీలో 'సామ్రాజ్య' పేరుతో రిలీజ్.. విజయ్ కొత్త పోస్టర్ వైరల్!
marriage | Himachal Pradesh | today-latest-news-in-telugu