/rtv/media/media_files/2025/07/20/rahul-sipligunj-2025-07-20-12-45-07.jpg)
Rahul Sipligunj
Rahul Sipligunj: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కి (Singer Rahul Sipligunj) తెలంగాణ ప్రభుతం రూ. కోటి నగదును బహుమతిగా ప్రకటించింది. ఈరోజు పాతబస్తీ బోనాల సందర్భంగా ఈ పురస్కారాన్ని అనౌన్స్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "సొంత కృషితో ఎదిగిన రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ యువతకు మార్గదర్శకుడు" అని ప్రశంసించారు. పాతబస్తీ నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గొప్ప విషయమని కొనియాడారు.
CM #RevanthReddy announced
— IndiaGlitz Telugu™ (@igtelugu) July 20, 2025
1 CRORE reward to #RRR fame singer #RahulSipligunjpic.twitter.com/FRpQVEBXeA
Also Read : రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
ఇచ్చిన మాట ప్రకారం..
అయితే 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, 'నాటు నాటు' పాటతో ఆస్కార్ సాధించిన తెలంగాణ కుర్రాడు రాహుల్ సిప్లిగంజ్ కు కోటి రూపాయల బహుమతి ఇస్తానని చెప్పారు. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం తన హామీని నిలబెట్టుకున్నారు. ఈరోజు బోనాల సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు.
Also Read : అమితాబ్ బచ్చన్ డైరెక్టర్ కన్నుమూత!
Also Read : కాలవ ధరించే విధానం.. దాని ప్రాధాన్యత తెలుసుకోండి
గల్లీ నుంచి ఆస్కార్ వరకు
చిన్న గల్లీ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన రాహుల్ 'నాటు నాటు' పాటతో ఆస్కార్ స్థాయికి వెళ్ళాడు. తెలంగాణ కుర్రాడిగా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. స్వయం కృషితో అతడు ఎదిగిని తీరును, ప్రతిభను ప్రశంసిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నగదు బహుమతిని ప్రకటించింది. ఇది రాహుల్ తో పాటు తెలంగాణలోని ఎంతో మంది యువ కళాకారులకు స్ఫూర్తి, ప్రోత్సాహాన్ని ఇస్తుందని చెప్పవచ్చు.
'నాటు నాటు' పాట తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గీతం. ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను కాలభైరవ, రాహుల్ కలిసి పాడారు. ఈ పాటతో రాహుల్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది.