/rtv/media/media_files/2025/07/20/ambati-rambabu-2025-07-20-11-45-13.jpg)
Ambati Rambabu
Ambati Rambabu
ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ గత నెల జూన్ 18న పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సమయంలో అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జూలై 21న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు.
Also Read : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
Also Read : తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 607 ఉద్యోగాలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఇదిలా ఉంటే గతంలో కూడా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్‌లో అంబటిపై కేసు నమోదు కాగా.. తాజాగా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు ఫైల్ అయింది. ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజనీతోపాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా జిల్లా నాయకులు ఉన్నారు. ఇలా మొత్తం 118 మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా.. ఇప్పటికే పలువురిని విచారించారు.
Also Read : కుక్క మంచి మనసు.. లేకదూడకు పాలిచ్చిన వీడియో వైరల్
Also Read : ఆపరేషన్సింధూర్ తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు
ambati-rambabu | sattanepalle | YS Jagan