MRI Machine: పేషెంట్ ప్రాణాలు తీసిన MRI స్కానింగ్ మెషిన్

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంటుండగా మృతి చెందాడు. MRI స్కానింగ్ కోసం మెషిన్‌లోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి బయటకు రాలేదు. మెడలో మెటల్ చైన్ ధరించడం వల్ల MRI మెషీన్‌లో రేడియేషన్ కారణంగా అందులోనే చనిపోయాడు.

New Update
man died in MRI machine

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుంటుండగా మృతి చెందాడు. MRI స్కానింగ్ కోసం మెషిన్‌లోకి వెళ్లిన వ్యక్తి ప్రాణాలతో తిరిగి బయటకు రాలేదు. మెడలో మెటల్ చైన్ ధరించడం వల్ల MRI మెషీన్‌లో రేడియేషన్ కారణంగా అందులోనే చనిపోయాడు. అమెరికా న్యూయార్క్‌లోని వెస్ట్‌బరీలోని ఓ హాస్పిటల్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. నసావు కౌంటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read :  ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు

US Man Killed Being Sucked Into An MRI Machine

Also Read :  AI ఫీచర్లతో శామ్‌సంగ్ కొత్త ఫోన్ అదిరింది.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ

MRI స్కానింగ్ మెషిన్ బాడీ స్కాన్ చేసేటప్పుడు బలమైన అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగిస్తాయి. స్కాన్ చేయించుకునే ముందు రోగులు నగలు, ఇతర లోహ వస్తువులను తీసివేయమని సలహా ఇస్తారు. మరి ఆ వ్యక్తి మెడలో చైన్‌తో ఎందుకు స్కానింగ్ మెషిన్‌లోకి వెళ్లాడో తెలియాలి. బాధితుడు మెడలో పెద్ద లోహ గొలుసు ధరించడం వల్ల అతను యంత్రంలోకి లాగబడ్డాడు, దీని ఫలితంగా వైద్యపరమైన ఎపిసోడ్ ఏర్పడింది" అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

Also Read :  ఉగ్రదాడికి ఆదారాలేవి.. టెర్రరిస్టులకు పాక్ బహిరంగ మద్ధతు

MRI మెషిన్‌లో చిక్కుకొని రోగులు చనిపోయిన ఘటనలు అరుదుగా జరుగుతాయి. ఇలాంటి దుర్ఘటన గతంలో కూడా జరిగాయి. అమెరికాలో 2001 ఆరేళ్ల బాలుడు స్కాన్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ ట్యాంక్‌ను యంత్రంలోకి లాగడంతో మరణించాడు. భారతదేశంలో 2018 ఒక వ్యక్తి ఆక్సిజన్ సిలిండర్‌ను మోసుకెళ్తున్న MRI గదిలోకి ప్రవేశించిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.

Also Read :  బాలయ్యతో యంగ్ బ్యూటీ ఐటమ్ సాంగ్.. అఖండ నుంచి అదిరిపోయే అప్డేట్!

mri-scanning | patient | newyork | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు