Kanwariyas: CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ రైల్వే స్టేషన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను కన్వరియాస్ యాత్రికులు (శివ భక్తులు) చితకబాదారు. ఆ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ టికెట్‌ అడగటంతో వాళ్లు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

New Update
Kanwariyas punch, kick CRPF jawan at UP station after spat over tickets

Kanwariyas punch, kick CRPF jawan at UP station after spat over tickets

ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌ రైల్వే స్టేషన్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను కన్వరియాస్ యాత్రికులు (శివ భక్తులు) చితకబాదారు.  రైల్వేస్టేషన్‌లో బ్రహ్మపుత్ర రైలు ఎక్కిన కన్వర్‌ యాత్రికులను ఆ సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ టికెట్‌ అడగటంతో వాళ్లు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kanwariyas Punch - Kick CRPF Jawan

Also Read: దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

Also Read :  సితార బర్త్ డే స్పెషల్.. మహేష్ బాబుతో ఫొటోలు వైరల్!

సమాచారం మేరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌ సిబ్బంది  ఘటనాస్థలానికి చేరుకున్నారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ను చితకబాదిన ఏడుగురు కన్వరియాస్ యాత్రికులును అరెస్ట్ చేశారు. ఇదిలాఉండగా ప్రతి సంవత్సరం నిర్వహించే కన్వర్‌ యాత్రలో కన్వారియాస్‌ యాత్రికులు పాల్గొంటారు. శివభక్తులైన ఈ యాత్రికులు గంగా నదికి నడుచుకుంటూ వెళ్లి.. అక్కడి నుంచి తీసుకొచ్చిన నీటిన ఆలయాల్లోకి తీసుకెళ్తారు. ఈ కన్వార్ యాత్ర జూలై 11న ప్రారంభం అయ్యింది. జూలై 23న ముగియనుంది. 

Also Read: ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా పార్లమెంట్ సమావేశాలు

Also Read :  లిక్కర్ స్కామ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు

telugu-news | rtv-news | Uttar Pradesh | crime

Advertisment
Advertisment
తాజా కథనాలు