/rtv/media/media_files/2025/07/19/midhun-reddy-2025-07-19-06-50-35.jpg)
P. V. Midhun Reddy
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. అయితే మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఆగస్టు 1 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ స్కామ్ కేసులో స్పష్టంగా మిథున్ రెడ్డి పాత్ర కనిపిస్తోంది. మనీ ట్రయల్‌తో పాటు కుట్రదారుడుగా సిట్ మిథున్ రెడ్డిని పేర్కొంది. మద్యం విధానం మార్పు, అమలు, ఇతర నిందితులతో కలిపి డిస్టిలరీలు, సప్లయర్ల నుంచి నగదు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది.
ఇది కూడా చూడండి:Alcohol: మద్యం మానేస్తే ఆరోగ్యంపై కలిగే ప్రయోజనాలు ఇవే.. 30 రోజులు ఇలా ట్రై చేయండి
ఏడు క్రిమినల్ కేసులు..
లిక్కర్ స్కామ్ డబ్బులను 2024 ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అధికార పార్టీ అభ్యర్థులకు పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఇతని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు సిట్ తెలిపింది. గతంలోనూ మిథున్‌రెడ్డిపై 7 క్రిమినల్ కేసులు ఉన్నాయని సిట్ తెలిపింది. అయితే దర్యాప్తుకు మిథున్ రెడ్డి సహకరించలేదని సిట్ తెలిపింది. మిథున్ రెడ్డికి కస్టోడియల్ విచారణ అవసరం. ముడుపుల పంపిణీ, కమీషన్లు ఎవరెవరికి చేరాయో తేలాల్సి ఉందని సిట్ తెలిపింది.
ఇది కూడా చూడండి:Producer AM Ratnam: ‘హరి హర వీరమల్లు’ నిర్మాతపై ఫిర్యాదు.. ఆందోళనలో ఫ్యాన్స్
అంతిమ లబ్ధిదారులను గుర్తించాల్సి ఉందని సిట్ తెలిపింది. స్పై ఆగ్రో, శాన్‌హాక్ లాబ్స్, డికార్డ్ లాజిస్టిక్ సంస్థలకు లిక్కర్ స్కామ్ ముడుపులు కట్టినట్లు సమాచారం. మిథున్ రెడ్డి సొంత సంస్థ PLR ప్రాజెక్ట్‌కు 15 కోట్లు జమ చేసినట్లు తెలుస్తోంది. డియర్ లాజిస్టిక్ నుంచి PLR ప్రాజెక్ట్‌కు 25 కోట్లు వెళ్లాయని సిట్ తెలిపింది. మనీ లాండరింగ్ అంశంపైనా విచారణ చేపట్టాల్సి ఉందని సిట్ తెలిపింది.
ఇదిలా ఉండగా మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఏ4 నిందితుడిగా చేర్చారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో దాదాపు 7 గంటల పాటు అధికారులు విచారించారు. అనంతరం ఆయన్ని అరెస్టు చేశారు. మరోవైపు ఇప్పటికే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అలాగే శుక్రవారం సుప్రీంకోర్టు కూడా ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన్ని సిట్ అధికారులు అరెస్టు చేశారు.
ఇది కూడా చూడండి: రాజాసింగ్ సంచలన నిర్ణయం.. ‘ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆ పార్టీని ఓడిస్తా’