China hydropower project: వాటర్ బాంబ్ పనులు ప్రారంభించిన చైనా

ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని వల్ల సరిహద్దులోని అరుణాచల్‌, అస్సాం రాష్ట్రాలకు ముప్పు పొంచిఉంది. అందుకే కొంతమంది చైనా వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు.

New Update
Yarlung Zangbo hydropower

ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణాన్ని చైనా శనివారం ప్రారంభించింది. దీని వల్ల సరిహద్దులోని అరుణాచల్‌, అస్సాం రాష్ట్రాలకు ముప్పు పొంచిఉంది. అందుకే కొంతమంది చైనా వాటర్ బాంబ్ అని పిలుస్తున్నారు. దీని కోసం రూ.14 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా. విద్యుత్తును భారీగా ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును టిబెట్‌లోని నైంగ్చి నగరంలో చేపట్టారు.

ఈ ప్రాజెక్ట్‌ ద్వారా సంవత్సరానికి 300 బిలియన్‌ కిలోవాట్‌-అవర్స్‌ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. టిబెట్‌లోని యార్లంగ్‌ జాంగ్సో (బ్రహ్మపుత్ర) నదిపై ఈ ప్రాజెక్టును నిర్మిస్తుంది. దీనిని భారత్‌, బంగ్లాదేశ్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.  గతంలో నిర్మించిన త్రీ గోర్జెస్‌ డ్యామ్‌ కన్నా మూడు రెట్లు పెద్దది. టిబెట్‌-అరుణాచల్‌ ప్రదేశ్‌ మధ్య ‘గ్రేట్‌ బెండ్‌’ వద్ద బ్రహ్మపుత్ర నది భారీ వంపుతో 2,000 మీటర్ల దిగువకు ప్రవహిస్తుంది.

చైనా-భారత్‌ మధ్య ఘర్షణ జరిగితే, చైనా ఈ డ్యామ్‌ నుంచి ఒకేసారి అత్యధికంగా నీటిని విడుదల చేస్తుందని, అప్పుడు అరుణాచల్‌, అస్సాం రాష్ర్టాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై పర్యవేక్షణ కొనసాగిస్తామని భారత్‌ ఇటీవల తెలిపింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. దిగువ ప్రాంతాలు నష్టపోకుండా జాగ్రత్త వహించాలని చైనాకు సూచించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు