/rtv/media/media_files/2025/07/20/wcl-2025-07-20-09-40-38.jpg)
India-Pakistan Mtach Cancelled
ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో ఈరోజు భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే టీమ్ ఇండియా మాజీ క్రికెటర్లు ఈ ఆటను ఆడ్డానికి ఇష్టం చూపించలేదు. బీసీసీఐ రూల్ ప్రకారం పాకిస్తాన్ తో ఇండియా ఏ మ్యాచ్ ఆడకూడదు. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయాన్ని ఆటగాళ్ళు పాటించారు. దీంతో డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు మ్యాచ్ క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఎవరూ ఎడ్జ్ బాస్టకు రావొద్దని సూచించారు. టికెట్ సొమ్మును మొత్తం రీఫండ్ చేస్తామని స్పష్టం చేశారు.
మొదట నుంచీ విమర్శలు..
అంతకు కొద్ది సేపటి ముందే శిఖర్ ధావన్ తాను పాక్ తో మ్యాచ్ ఆడటం లేదని అనౌన్స్ చేశాడు. స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే విషయాన్ని నిర్వాహకులకు తెలిపాడు. ఈ లీగ్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నానని..ఆ విషయం అప్పుడే మెయిల్ చేశానని శిఖర్ చెప్పాడు. ఇప్పటికే అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని తెలిపాడు. తనకు ఆటకన్నా దేశమే ముఖ్యమని...దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని తెగేసీ చెప్పేశాడు.
ఈ మ్యాచ్ పై ముందు నుంచీ విమర్శలు ఎదురౌతూనే ఉన్నాయి. పహల్గాం దాడి తర్వాత పాక్ తో ఏ మ్యాచ్ లూ ఆడమని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నాక మాజీలు ఎలా ఆడతారు అంటూ చాలా విమర్శలు వచ్చాయి. అసలు పాక్‌తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇప్పుడు మ్యాచ్ క్యాన్సిల్ అయ్యాక ఇరు జట్లకూ చెరో పాయింట్ ఇచ్చారా లేదా అన్నది మాత్రం తెలియలేదు.
Also Read: Abujhmad: అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్..ఆరు మావోయిస్టులు మృతి