/rtv/media/media_files/2025/07/20/calf-drank-dogs-milk-2025-07-20-11-58-26.jpg)
calf drank dogs milk
Viral Video: చిత్తూరు జిల్లా పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో ఓ వింత సంఘటన వెలుగుచూసింది. లేగదూడ కుక్క పాలు తాగుతూ కనిపించింది. సాధారణంగా ఆవు దూడ ఆవుపాలు మాత్రమే తాగుతుంది. ఒకవేళ దానికి తల్లి లేకపోయినా, పాలు తాగనివ్వకపోయినా మనుషులు పాలు పట్టడం చేస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం విచిత్రంగా.. తల్లిని కోల్పోయి ఆకలితో ఉన్న లేగదూడకు ఒక కుక్క తన పాలు ఇచ్చి ఆకలి తీర్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్.. ఇది చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అక్కడి గ్రామస్థులు అయితే తమకు ఇదొక వింతలా అనిపిస్తుందని చెబుతున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా కుక్క దూడకు పాలిస్తున్నట్లు తెలిపారు.
Also Read : ఉగ్రదాడికి ఆదారాలేవి.. టెర్రరిస్టులకు పాక్ బహిరంగ మద్ధతు
Also Read : సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ ప్రభుతం రూ. కోటి బహుమతి!
వీడియో వైరల్
బ్రహ్మంగారి కాలజ్ఞానం.. చిత్తూరు జిల్లాలో వింత ఘటన
— RTV (@RTVnewsnetwork) July 20, 2025
లేగదూడకు పాలిస్తున్న శునకం.. వైరల్గా మారిన వీడియో
తల్లిలా లేగ దూడలు కుక్క పాలివ్వడంతో ఆశ్చర్యానికి గురైన జనం
ప్రతిరోజు క్రమం తప్పకుండా దూడకు పాలిస్తుందంటున్న గ్రామస్తులు
పలమనేరు వి.కోట మండలం గోనుమాకనపల్లిలో… pic.twitter.com/hxeHPJr7MO
Also Read : AI ఫీచర్లతో శామ్‌సంగ్ కొత్త ఫోన్ అదిరింది.. ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ
latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news
Follow Us