🔴Live News Updates: తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

AP News: సింగయ్య మృతికి వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చింది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ అధికారులు.. ఘటన సమయంలో సెల్‌ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని వెల్లడించారు. మార్ఫింగ్‌ వీడియోలంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్‌ నివేదిక కీలకంగా మారింది.

Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. బెయిల్‌కు ఆర్థిక సాయం

అవన్నీ ఒరిజినల్‌వే

ఈ మేరకు జగన్ ర్యాలీ సందర్భంగా చిత్రీకరించిన కార్యకర్తల 6 ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపించారు. ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించగా.. అవన్నీ ఒరిజినల్‌వేనని స్పష్టమైంది. ఇక జూన్‌ 18న పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జగన్‌ వాహనం కింద పడి సింగయ్య చనిపోయారు. మొదట దేవినేని అవినాష్‌ అనుచరుడి వాహనం ఢీకొన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వారు అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అనంతరం జగన్‌ వాహనం కింద పడి సింగయ్య మరణించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు మలుపుతిరిగింది. 

 

  • Jul 01, 2025 21:16 IST

    ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ

    ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాలో విషాదం చోటు చేసుకుంది.పరశురాం అనే వ్యక్తి కుమారుడు సందీప్ మృతి చెందాగా కూతురు సింధు తీవ్రంగా గాయలతో మంచానికే పరిమితమైంది. ఇవన్నీ మానసికంగా కృంగి తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

     

    Khammam Crime News
    Khammam Crime News

     



  • Jul 01, 2025 21:15 IST

    ఏపీలో టెర్రరిస్టుల కలకలం.. ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

    ఏపీలో మరోసారి ఉగ్రమూకల కలకలం రేగింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. వారిని అబూబక్కర్ సిద్దీక్క్ (నాగూర్), మొహమ్మద్ అలీ అలియాస్ యూనుస్ (మేళపలయం)గా గుర్తించారు.



  • Jul 01, 2025 21:14 IST

    తెలంగాణ కొత్త రేషన్ కార్డుల పంపిణీ..

    ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు.

     

    Telangana Ration Cards
    Telangana Ration Cards

     



  • Jul 01, 2025 20:12 IST

    ఏపీలో సెల్ ఫోన్ గొడవ.. దారుణంగా హత్య చేసిన తాగుబోతు

    కాకినాడ జిల్లా గడ్డిపేటలో దారుణ హత్య కలకలం రేపుతోంది. వెల్డర్‌గా పనిచేస్తున్న ఓ యువకుడు తన సహచరుడి గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు బీహార్‌ చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    kakinada crime



  • Jul 01, 2025 19:36 IST

    హరీష్ రావు నుంచి ఫోన్.. ఆ పార్టీలో చేరబోతున్నా.. రాజాసింగ్ సంచలన ప్రకటన!

    బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు.

    Harish Rao Raja Singh



  • Jul 01, 2025 18:18 IST

    వల్లభనేని వంశీకి బెయిల్.. రేపే విడుదల!

    నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్‌ లభించింది. నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో రేపు జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. 

     

    Vallabhaneni Vamshi
    Vallabhaneni Vamshi

     



  • Jul 01, 2025 16:56 IST

    వ్యక్తిత్వ వికాస నిపుణులు బి.వి.పట్టాభిరామ్ కన్నుమూత!

    ప్రముఖ పర్సనాలిటీ డెవెలప్మెంట్ నిపుణులు బీవీ పట్టాభిరామ్‌ కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హిప్నాటిస్టు, మెజీషియన్ గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు.

     

    BV Pattabhiram passed away
    BV Pattabhiram passed away

     



  • Jul 01, 2025 16:55 IST

    ఇదేం పిచ్చిరా బాబు.. స్కూటీ ధర రూ.1లక్ష.. నంబర్ ప్లేట్ రూ.14 లక్షలు

    హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి VIP రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశాడు. ఆ స్కూటీ ధర కేవలం రూ.1లక్ష మాత్రమే కావడం విశేషం. అతడు ఇంత డబ్బు పెట్టి ‘HP 21 C 0001’ అనే నెంబర్ ప్లేట్‌ను కొన్నాడు.

     

    Himachal Pradesh Man spent rs14 lakh VIP number plate for Honda Activa scooter
    Himachal Pradesh Man spent rs14 lakh VIP number plate for Honda Activa scooter

     



  • Jul 01, 2025 15:44 IST

    మరో ఫ్యాక్టరీలో భారీ ప్రమాదం.. బాయిలర్ బ్లాస్ట్

    మేడ్చల్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇండస్ట్రియల్ ఏరియాలోని ఆల్కలాయిడ్‌ బయో యాక్టివ్‌ ఫార్మా పరిశ్రమలో మంగళవారం బాయిలర్‌ పేలింది. ఈ ప్రమాదంలో విధుల్లో ఉన్న కార్మికుడు శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

     

    BREAKING NEWS
    BREAKING NEWS

     



  • Jul 01, 2025 15:13 IST

    NTR జిల్లాలో దారుణం.. కొడుకును చెక్కతో కొట్టి చంపిన తండ్రి

    ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేట గ్రామంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొడుకు వెంకటనారాయణ (35)ను కన్న తండ్రి చెక్క ముక్కతో కొట్టి హతమార్చాడు. సోమవారం రాత్రి ఫుల్‌గా తాగొచ్చి తల్లిదండ్రులపై దాడిచేయడంతో తండ్రి చంపేశాడు.

     

    father killed his son with wood in NTR district
    father killed his son with wood in NTR district

     



  • Jul 01, 2025 14:26 IST

    సీమాంతర ఘర్షణలు.. ఆ దేశ ప్రధానిపై వేటు

    థాయ్‌లాండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిపై వేటు పడింది. థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్డు మంగళవారం ప్రధానమంత్రి పెటంగటార్న్‌ షినవత్రాపై సస్పెన్షన్ విధించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

     

    Thailand PM Paetongtarn Shinawatra Suspended Over A Leaked Phone Call
    Thailand PM Paetongtarn Shinawatra Suspended Over A Leaked Phone Call

     



  • Jul 01, 2025 13:59 IST

    Phone-Tapping : పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్‌ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?

    తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి  కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు.

     

    Phone tapping Case
    Phone tapping Case

     



  • Jul 01, 2025 13:46 IST

    Telangana: 2 నెలల క్రితమే పెళ్లి.. పాశమైలారం ఘటనలో నవ దంపతుల మృతి

    పాశమైలారం ప్రమాద ఘటనలో మరో కీలక విషయం బయటపడింది. రెండు నెలల క్రితమే పెళ్లయిన నవ దంపతులు మృతి చెందడం కలకలం రేపింది. సిగాచి కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన నిఖిల్‌ రెడ్డి, శ్రీరమ్య అనే నవదంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.

     

    Newly Married Couple Dead in Sangareddy Chemical Blast
    Newly Married Couple Dead in Sangareddy Chemical Blast

     



  • Jul 01, 2025 13:03 IST

    JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,208 పోస్టులతో భారీ నోటిఫికేషన్!

    బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

    jobs



  • Jul 01, 2025 12:12 IST

    Psycho Husband : అమెరికాలో సైకో మొగుడు...భార్యపిల్లల్ని వదిలి ఇండియాకు..

    అమెరికాలో భార్యపిల్లల్ని హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న ఒక సైకో మొగుడి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఆ సైకో చేతిలో చిత్రహింసలకు గురైన భార్య పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడే వదిలేసి ఇండియాకు రావడంతో వారు ఇబ్బంది పడుతున్నారు.

    Psycho Husband in America



  • Jul 01, 2025 11:05 IST

    Vishwambhara: మెగాస్టార్ తో బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్!

    బాలీవుడ్ యంగ్ బ్యూటీ మౌని రాయ్ మెగాస్టార్ తో కలిసి  స్టెప్పులేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం.. చిరంజీవి  రాబోయే సినిమా 'విశ్వంభర' లో స్పెషల్ సాంగ్ కోసం ఈముద్దుగుమ్మను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

     

    mouni roy special song with megastar Chiranjeevi
    mouni roy special song with megastar Chiranjeevi

     



  • Jul 01, 2025 11:04 IST

    Thammudu Trailer: 'తమ్ముడు' ట్రైలర్ వచ్చేసింది! ఇక్కడ చూడండి

    హీరో నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్, ఎమోషన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. తమ్ముడు జులై 4న విడుదల కానుంది.

     

    Thammudu trailer
    Thammudu trailer

     



  • Jul 01, 2025 10:03 IST

    Road Accident: బాలానగర్ ప్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం..ఒకరు మృతి..ఎస్ఐకి గాయాలు

    బాలానగర్‌ ప్లై ఓవర్ పై రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఓ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన పై పోలీసులు కేసులు నమోదు చేశారు.

    Road Accident



  • Jul 01, 2025 09:52 IST

    Weather Report : తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం...దంచికొడుతున్న వర్షం

    అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్నటి నుంచి పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది.

     

    Northeast Floods, Landslides Kills 19, Displace Over 12,000 Amid Heavy Rainfall

     



  • Jul 01, 2025 09:51 IST

    Pakistan Economic Crisis : తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్‌..భారత్ దెబ్బతో ఉక్కిరి బిక్కిరి

    పాకిస్థాన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తరిగిపోతున్న విదేశ మారక ద్రవ్య నిల్వలు, గుదిబండలా మారుతున్న రుణ భారం- పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వీటి నుంచి దాయాది దేశం కోలుకోవడం అంత తేలిక కాదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

    pakistan economy



  • Jul 01, 2025 09:46 IST

    Dwcra Womens : డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు..ఎక్కడో తెలుసా?

    డ్వాక్రా మహిళలకు మరింత ప్రయోజనం కలిపించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారికోసం 'డీజీ లక్ష్మి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 250 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. శిక్షణ కోసం ప్రభుత్వం రూ.23.84 కోట్లు కేటాయించింది.

    Dwcra Womens



  • Jul 01, 2025 09:45 IST

    TRANSGENDERS : ట్రాన్స్ జెండర్లకు గుడ్‌ న్యూస్..ఉపాధి దిశగా అడుగులు

    తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. రవాణా, ఐటీ సెక్టర్, ప్రైవేట్ కంపెనీ అలాగే హెల్త్, ఎండోమెంట్స్ లలో ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

    Transgenders



  • Jul 01, 2025 07:25 IST

    ఘోర రోడ్డు ప్రమాదం.. టెంపోను ఢీకొట్టిన లారీ..15 మంది

    అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలను దర్శించుకుని తిరిగివస్తున్న టెంపోట్రావెలర్‌ను కంటెయినర్‌ లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

    Screenshot 2025-07-01 063100



  • Jul 01, 2025 07:25 IST

    పాశమైలారం ఘటనలో 37కి చేరిన మృతుల సంఖ్య

    సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 37కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

    Screenshot 2025-07-01 065841



Advertisment
Advertisment
తాజా కథనాలు