/rtv/media/media_files/rupNqZU1Mns5JiBv41DA.jpg)
Heavy Rainfall
Heavy Rains : అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో నిన్నటి నుంచి పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు ఉత్తరబంగాళాఖాతం, ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమబెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిరించింది. ఈ ఆల్పపీడనం బలపడటంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!
తెలంగాణలోని 19 జిల్లాల్లో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. దీంతో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి.
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
అలాగే నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల, నిజామాబాద్, మెదక్ సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్ పేట్, మేడ్చల్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో సాదారణ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!
ఇక బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు.. మిగతాజిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ