MLA Raja Singh: హరీష్ రావు నుంచి ఫోన్.. ఆ పార్టీలో చేరబోతున్నా.. రాజాసింగ్ సంచలన ప్రకటన!

బీజేపీ ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత తన భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హరీష్ రావు తనకు మంచి మిత్రుడని.. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతానని చెప్పారు. మహారాష్ట్రకు చెందిన హిందూ పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందన్నారు.

New Update
Harish Rao Raja Singh

నిన్న బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్ నేడు మీడియాతో చిట్ చాట్ చేశారు. రాజీనామాపై ఢిల్లీ నుంచి త్వరలోనే రెస్పాన్స్ వస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ పెద్దల నిర్ణయం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. తన రాజీనామాను ఆమోదిస్తే.. హిందూ ధర్మం కోసం పనిచేస్తానని ప్రకటించారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన కూడా లేదన్నారు.

Also Read :  Portugal Roll Cloud: భూమి, ఆకాశం ఒక్కటవ్వడం చూశారా? - షాకింగ్ వీడియోస్

Also Read :  కిడ్నీ రాళ్ళ సమస్య తలెత్తే ప్రమాదం.. నిపుణులు ఏమంటున్నారంటే...!!

Also Read :  గుండెపోటా లేక గుండె ఆగిందా.. అంటారు. అసలు వీటి అర్థమేంటి..!!?

Also Read :  రెండు బస్సులు ఢీ.. మంటల్లో కాలిబూడిదైన 40 మంది ప్రయాణికులు

హరీశ్ రావు నాకు ఫ్రెండ్..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తనకు మంచి మిత్రుడని అన్నారు. అప్పుడప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతుంటానన్నారు. రాష్ట్రంలో బీజేపీని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కిషన్ రెడ్డి వల్ల బీజేపీ అధికారంలోకి రావడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి పార్టీని ఎదగనివ్వడం లేదన్నారు. అధిష్టానం పిలిస్తే కిషన్ రెడ్డిపై మొత్తం చెప్పేస్తానని బాంబ్ పేల్చారు. తనకు చివరి నిమిషంలో నామినేషన్ పత్రాలు ఇచ్చారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ వాళ్లు తనను తీసుకోరన్నారు. మహారాష్ట్ర నుంచి హిందూ పార్టీలు తనను ఆహ్వానిస్తున్నాయన్నారు. తన వెనుక ప్రజలు ఉన్నారన్నారు. 

harish-rao | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | telangana-news-updates | telangana news today

Advertisment
తాజా కథనాలు