/rtv/media/media_files/2025/07/01/screenshot-2025-07-01-063100-2025-07-01-06-40-06.jpg)
Accident: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలను దర్శించుకుని తిరిగివస్తున్న టెంపోట్రావెలర్‌ను కంటెయినర్ లారీ ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ముగ్గురు చనిపోగా12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు కర్ణాటకలోని బాగేపల్లెకు చెందిన మూడు కుటుంబాల వారుగా పోలీసులు గుర్తించారు.
కియా కార్ల లారీ..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున కురబలకోట మండలం చెన్నామర్రిమిట్ట వద్ద వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని కియా పరిశ్రమ నుంచి చెన్నైకు కార్లను తరలిస్తున్న కంటెయినర్ లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. టెంపోట్రావెలర్‌లో ఉన్న చరణ్ (16), శ్రావణి (24), మేఘర్ష్ (16) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్‌తో సహా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం బెంగళూరుకు తరలించినట్లు చెప్పారు.