Phone-tapping : పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్‌ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి  కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు.

New Update
Phone tapping Case

Phone tapping

Phone-tapping : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసు నేపథ్యంలో  కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి  కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసుకోవచ్చు. కానీ, ఆ ఫోన్లను ట్యాప్ చేయాలంటే మాత్రం కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవలసిందే. ఫోన్‌ట్యాపింగ్‌ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో పలువుర ప్రతిపక్ష నేతలతో పాటు సినిమా, ప్రభుత్వ అధికారుల  ఫోన్‌లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలున్నాయి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు గాను, నిఘా కార్యకలాపాలు చట్టబద్ధంగా ఉండేందుకు గాను ఈ కొత్త నిబంధన దోహదపడుతుందని కేంద్రం చెబుతోంది.

ఇది కూడా చూడండి:TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

ఆయా రాష్ట్రాల సరిహద్దుల బయట ఉన్న వ్యక్తుల ఫోన్‌లను ట్యాప్ చేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనను ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన టెలికమ్యూనికేషన్స్ నిబంధనలు-2024 (చట్టబద్ధమైన ట్యాపింగ్‌కు నిబంధనలు, జాగ్రత్తలు) లో సవరణ చేస్తూ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ముసాయిదాను విడుదల చేసింది.  ప్రస్తుతం ఉన్న నిబంధన 2(సి) ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పరిధిలో అయితే కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర పరిధిలో రాష్ట్ర హోం శాఖ కార్యదర్శికి మాత్రమే ఫోన్ ట్యాపింగ్‌కు అనుమతి ఇచ్చే అధికారం కలిగి ఉంది. అయితే మారిన నిబంధన ప్రకారం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాదేశిక సరిహద్దులకు బయట ఉన్న వ్యక్తుల ఫోన్‌లను ట్యాప్ చేయాలంటే కేంద్రం నుంచి తప్పనిసరి అనుమతి తీసుకోవసిందే. దీనికిగాను ఆయా రాష్ర్టాల హోం శాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శి  నుంచి వచ్చిన విజ్ఞప్తితో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనుమతి ఇవ్వడానికి అవకాశం కల్పిస్తారు.

ఇది కూడా చూడండి:DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

అయితే దానికి నిర్ధిష్ట కారణం ఉండాలి. ముఖ్యంగా ప్రజా అత్యవసర పరిస్థితి, ప్రజా భద్రత ప్రయోజనాలు వంటి సందర్భాల్లో కేంద్రం గానీ, రాష్ట్రం గానీ ట్యాపింగ్‌కు అనుమతి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా దేశ సార్వభౌమత్వం, సమగ్రత, దేశ రక్షణ, భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, శాంతిభద్రతల ప్రయోజనాలు కాపాడటానికి లేదా జరగబోయే నేరాన్ని ముందుగా గుర్తించి ప్రమాదాన్ని అరికట్టడానికి ఇది దోహదపడుతుంది. 

ఇది కూడా చూడండి:CM Chandrababu Naidu: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం.. ఆ 15 మంది ఎమ్మెల్యేపై చర్యలు!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర సరిహద్దుల వెలుపల, ముఖ్యంగా కీలక వ్యక్తుల కదలికలను, సంభాషణలను పసిగట్టడానికి చట్టవిరుద్ధంగా ఫోన్‌లను ట్యాప్ చేశారన్నది ఆరోపణ.  దీని ద్వారా రాజకీయ ప్రత్యర్థులు మీడియా ప్రతినిధులపై నిఘా పెట్టారని ఆరోపణలున్నాయి. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండడానికి చట్టబద్ధమైన పద్ధతుల్లో మాత్రమే నిఘా కార్యకలాపాలు నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.  దీనికి సంబంధించి సూచనలు, అభ్యంతరాలు, అభిప్రాయాలను 30 రోజుల్లోపు జాయింట్ సెక్రటరీ (టెలికాం), టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సంచార్ భవన్, 20-అశోకా రోడ్, న్యూఢిల్లీ-110001 చిరునామాకు పంపాలని కేంద్రం కోరింది.  ఈ నిబంధన అమలులోకి వస్తే.. దేశంలో నిఘా కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో జరిగే అవకాశం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

ఇది కూడా చూడండి:Anchor Swetcha : యాంకర్‌ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్‌...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?

Advertisment
తాజా కథనాలు