Vishwambhara: మెగాస్టార్ తో బాలీవుడ్ బ్యూటీ ఐటమ్ సాంగ్!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ మౌని రాయ్ మెగాస్టార్ తో కలిసి  స్టెప్పులేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం.. చిరంజీవి  రాబోయే సినిమా 'విశ్వంభర' లో స్పెషల్ సాంగ్ కోసం ఈముద్దుగుమ్మను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

New Update

Vishwambhara: బాలీవుడ్ యంగ్ బ్యూటీ మౌని రాయ్ మెగాస్టార్ తో కలిసి  స్టెప్పులేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం.. చిరంజీవి  రాబోయే సినిమా 'విశ్వంభర' లో స్పెషల్ సాంగ్ కోసం ఈముద్దుగుమ్మను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సాధారణంగా మెగాస్టార్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ పెద్ద హిట్స్ గా నిలుస్తుంటాయి. గతంలో విడుదలైన 'ఖైదీ నెం150' లో రత్తాలు సాంగ్,  'వాల్తేరు వీరయ్య' లో ఊర్వశీ 'బాస్ పార్టీ' సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు 'విశ్వంభర' లో కూడా అదే ట్రెండ్ ని కొనసాగిస్తున్నారు. ఈ స్పెషల్ నెంబర్ లో మౌని రాయ్ తన గ్లామర్, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నట్లు తెలుస్తోంది.

మౌని రాయ్ స్క్రీన్ ప్రెజెన్స్, గ్లామర్, దేశవ్యాప్తంగా ఆమెకున్న క్రేజ్ సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.  'కేజీఎఫ్', 'బ్రహ్మాస్త్ర' వంటి సినిమాలతో మౌని రాయ్ పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. తరచూ గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఫిదా చేస్తుంటుంది.  

సోషియో ఫాంటసీ డ్రామా

వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో వీఎఫెక్స్ ప్రధాన ఆకర్షణగా నిలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో  నిర్మాతలు వీఎఫెక్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులతో కలిసి పనిచేస్తున్నారు. 

ఈ సినిమాలో త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది. దాదాపు 18 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఆమె చిరంజీవితో  కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్  జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Advertisment
Advertisment
తాజా కథనాలు