/rtv/media/media_files/2025/06/30/financial-assistance-for-bail-of-poor-prisoners-2025-06-30-09-45-40.jpg)
Financial assistance for bail of poor prisoners
సాధారణంగా ఎవరైనా నేరం చేస్తే వాళ్లని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలిస్తారు. ఆ తర్వాత నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొంత మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తుంది. ఆ డబ్బులు చెల్లిస్తేనే బెయిల్‌పై బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే చాలామంది పేదఖైదీలు డబ్బులు చెల్లించలేకపోతారు. దీంతో వాళ్లు బెయిల్ మంజూరైనప్పటికీ జైల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే పేద ఖైదీలకు మద్దతు పథకం కింద సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
Also Read: దుర్మార్గ తండ్రి.. నాలుగేళ్ల కూతురు చాక్లెట్ అడిగిందని.. దారుణంగా!
అన్ని రాష్ట్రాల హోంశాఖ ముఖ్య కార్యదర్శులకు, జైళ్లశాఖ డీజీలకు ఇటీవల హోంశాఖ లేఖ రాసింది. ఈ స్కీమ్ కింద అర్హులైన వారి జాబితా రూపొందిస్తే వాళ్లు చెల్లించాల్సిన జరిమానాను కేంద్రమే చెల్లిస్తుంది. రిమాండ్‌తో పాటు శిక్షపడిన ఖైదీలకు సైతం ఈ స్కీమ్ వర్తిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిప్రకారం జిల్లా, రాష్ట్రస్థాయిలో కమిటీలు నియమించాలి. రిమాండ్ ఖైదీలైనా, శిక్షపడిన వారైనా బెయిల్ వచ్చాక కూడా 7 రోజుల తర్వాత విడుదల కాకపోతే వాళ్ల లిస్ట్‌ను రూపొందిస్తారు. ఇందులో జరిమానా చెల్లించలేని వారిని గుర్తిస్తారు.
Also Read: కేంద్రం కొత్త పథకం.. రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు..!
రిమాండ్ ఖైదీల జరిమానా మొత్తం రూ.40 వేల లోపు ఉన్నట్లయితే అంత మొత్తం రిలీజ్ చేయాలని ఈ స్కీమ్‌కు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (CNA)గా ఉన్న జాతీయ నేరాల నమోదు సంస్థని జిల్లా కమిటీ అభ్యర్థిస్తుంది. దీంతో CNA అంత మొత్తం విడుదల చేస్తుంది. ఒకవేళ జరిమానా రూ.40 వేలకు మించి ఉంటే ఆ విషయాన్ని జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి తెలియజేస్తుంది. ఈ తర్వాత రాష్ట్ర కమిటీ దీన్ని పరిశీలించి CNAకు రాస్తుంది. దీంతో ఆ మొత్తాన్ని సీఎన్‌ఏ విడుదల చేస్తుంది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు ఈ స్కీమ్ కింద అర్హులైన ఖైదీల జాబితాను రాష్ట్రాల్లో సిద్ధం చేస్తున్నారు. అయితే డ్రగ్స్, మనీ ల్యాండరింగ్, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాల కింద అరెస్టయిన వాళ్లకి ఈ పథకం వర్తించదు.