TG Crime: ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాలో విషాదం చోటు చేసుకుంది.పరశురాం అనే వ్యక్తి కుమారుడు సందీప్ మృతి చెందాగా కూతురు సింధు తీవ్రంగా గాయలతో మంచానికే పరిమితమైంది. ఇవన్నీ మానసికంగా కృంగి తండ్రి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
Khammam Crime News

Khammam Crime News

TS Crime:  ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ధర్మతండాలో ఒక తండ్రి కన్నీటి పోరాటం ముగిసింది. పరశురాం అనే మధ్యతరగతి తండ్రి తన బిడ్డల జీవితాలను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు చివరికి విఫలమయ్యాయి. రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఆయన కుటుంబ జీవితాన్నే తుడిచిపెట్టేసింది. ఎంసెట్ పరీక్ష రాసి వస్తున్న కుమారుడు జరుపుల సందీప్ అప్పుడు జరిగిన ప్రమాదంలో తలపై తీవ్రమైన గాయమైంది. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. అదే ప్రమాదంలో అతని చెల్లెలు సింధు తీవ్రంగా గాయపడింది. తలపై గాయం, వెన్నెముక పాడవ్వడం వంటి సమస్యలతో ఆమె పూర్తిగా మంచానికే పరిమితమైంది.

ఆర్థికంగా భారం పెరిగి..

కూతురిని కోలుకోవాలన్న తండ్రిగా పరశురాం చేసిన పోరాటం మాటల్లో చెప్పలేనిది. రూ.50 లక్షల వరకు అప్పులు చేసి ఎన్నో ఆసుపత్రుల్లో చికిత్స చేయించాడు. పలు ఆపరేషన్లు, నెలల తరబడి ఆసుపత్రుల చుట్టూ తిరిగిన పరశురాం.. తన కూతురి బాధను తట్టుకోలేకపోయాడు. ప్రతి నెలా మందులు, చికిత్సలకు రూ.60 వేలకు పైగా ఖర్చ పెడుతున్నాడు. కానీ ఆర్థిక పరిస్థితి క్రమంగా దిగజారిపోయింది. బంధువుల నుంచి అప్పులు, ఇంటి ఖర్చులు, ఆసుపత్రి బిల్లులు అన్నీ ఒక్కటై ఓ భారంగా మారాయి. 

ఇది కూడా చదవండి: అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి

కూతురు పూర్తిగా మంచానికే పరిమితమవడం, కొడుకు మరణం..ఇవన్నీ పరశురాంను మానసికంగా కృంగదీసాయి. ఇవన్నీ తట్టుకోలేక ఆదివారం పరశురాం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. భర్త మృతి చెందడంతో భార్య లలిత కన్నీటి విలపంతో గుండెలు పిండేలా రోదిస్తోంది. ఒక తండ్రి విధి ఎదురీదిన బాధ, కన్నబిడ్డల కోసం చేసిన ఆఖరి పోరాటం కూడా ఫలితం లేకుండా పోయింది.  

(ts-crime | ts-crime-news | Latest News | telugu-news | crime news | crime news in telugu | khammam-crime | khammam crime latest | Khammam crime news | khammam crime today)

ఇది కూడా చదవండి:
ఏపీలో సెల్ ఫోన్ గొడవ.. దారుణంగా హత్య చేసిన తాగుబోతు

Advertisment
Advertisment
తాజా కథనాలు