/rtv/media/media_files/UVFQCkyjH5diXHnI5Q4H.jpg)
TRANSGENDERS
TRANSGENDERS : ట్రాన్స్ జెండర్లు అనగానే మనకు.. జంక్షన్ల దగ్గర, రైళ్లు, బస్సుల్లో డబ్బులు యాచించడం, శుభకార్యాలు, షాపుల ఓపెనింగ్‌ల సమయంలో బలవంతంగా వసూళ్లు వంటివే గుర్తుకు వస్తాయి. డబ్బులు ఇవ్వకుంటే.. జనాలను ఇబ్బంది పెడుతారనే భావనే చాలా మందిలో ఉంది. అయితే.. కొంత మంది ట్రాన్స్‌జెండర్లు చేసే ఇలాంటి పనులతో అందరిపట్ల అదే భావన నెలకొంది. అయితే.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వారికి గుడ్‌న్యూస్ చెప్పేందుకు సిద్దమయ్యారు. ట్రాన్స్ జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలోని ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు సూచనలు చేశారు. రవాణా, ఐటీ సెక్టర్, ప్రైవేట్ కంపెనీ అలాగే హెల్త్, ఎండోమెంట్స్ లలో ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులకు సూచించారు.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
ట్రాన్స్జెండర్లకు ఇప్పటికే నగరంలో ట్రాఫిక్వలంటీర్లుగా ఉద్యోగావకాశాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి మరింత చేయూత ఇచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన వారికి జీహెచ్ఎంసీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ట్రాన్స్ జెండర్ల సేవలను జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాల్లో ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై తగిన సలహాలు ఇవ్వాలని సీఎం అధికారులను కోరారు.
ఇది కూడా చదవండి: నిమ్మకాయ నీటిలో నల్ల ఉప్పు కలిపి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు