Thailand PM: సీమాంతర ఘర్షణలు.. ఆ దేశ ప్రధానిపై వేటు

థాయ్‌లాండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిపై వేటు పడింది. థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్డు మంగళవారం ప్రధానమంత్రి పెటంగటార్న్‌ షినవత్రాపై సస్పెన్షన్ విధించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది.

New Update
Thailand PM Paetongtarn Shinawatra Suspended Over A Leaked Phone Call

Thailand PM Paetongtarn Shinawatra Suspended Over A Leaked Phone Call

థాయ్‌లాండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశ ప్రధానిపై వేటు పడింది. థాయ్‌లాండ్ రాజ్యాంగ కోర్డు మంగళవారం ప్రధానమంత్రి పెటంగటార్న్‌ షినవత్రాపై సస్పెన్షన్ విధించింది. జులై 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. కంబోడియాతో సరిహద్ద చర్చలు జరుగుతున్న వేళ.. షినవత్రా తన విలువలు మరిచిపోయి ప్రవర్తించినట్లు కన్జర్వేటివ్ సెనేటర్లు ఆరోపణలు చేశారు.  

Also Read: మూడేళ్లుగా సహజీవనం.. ప్రియురాలని చంపి.. మృతదేహంతోనే రెండ్రోజులు

Thailand PM Paetongtarn Shinawatra Suspended

 ప్రధాని తీరు వల్లే సరిహద్దు సమస్య మరింత కఠినంగా మారిందని.. దీనివల్ల మే నెలలో సీమాంతర ఘర్షణలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘర్షణల్లో ఓ కంబోడియా సైనికుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే కంబోడియాతో షినవత్రా జరిపిన చర్చలకు సంబంధించి ఫోన్‌ కాల్స్‌ ఇటీవలే లీకయ్యాయి. ఈ క్రమంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కంబోడియా రాజకీయవేత్తను అంకుల్ అని అనడం, మిలటరీ కమాండర్‌ను ప్రత్యిర్థిగా భావిస్తూ షివవత్రా కామెంట్స్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 

Also Read: అది జరిగితే మరిసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్‌ మస్క్

అయితే తాజాగా రాజ్యాంగం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మరో 15 రోజుల్లోగా ప్రధాని షినవత్రా తన వాదనలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆమె కేసును డిస్మిస్ చేస్తారు. ఈ సమయంలో తాత్కాలిక దేశ ప్రధానమంత్రిగా ప్రస్తుత డిప్యూటీ పీఎం సురియా జున్‌గ్రున్‌గ్రుంగిట్ విధులు నిర్వహించనున్నారు. ఒకవేళ షినవత్రాను పదవి నుంచి తప్పిస్తే.. ప్రధాని బాధ్యతల నుంచి సస్పెండ్ అయిన రెండో వ్యక్తిగా ఆమె నిలవనున్నారు. 

Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!

Also Read :  అనారోగ్యమా... అయితే మఖానా తినండి.. అది ఎందుకో తెలుసుకోవడానికి ఇప్పుడే చదవండి

 

international news in telugu | latest-telugu-news | today-news-in-telugu | Breaking Telugu News

Advertisment
Advertisment
తాజా కథనాలు