/rtv/media/media_files/2025/03/21/DWTA1xvJf916uppoMaqX.jpg)
Telangana Ration Cards
TG New Ration Cards: తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై ఎట్టకేలకు నిర్ణయం ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న తొలి ప్రజా ప్రయోజన నిర్ణయాల్లో ఇది ఒకటి. రేషన్ కార్డుల కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న అర్హులైన కుటుంబాలకు తీపి కబురు అందించింది ప్రభుత్వం. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. తొలి విడతలో రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు కార్డులు అందజేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే అర్హుల జాబితాను తుది రూపంలో సిద్ధం చేయగా.. ఆయా దరఖాస్తులను అధికారులు పరిగణనలోకి తీసుకుని, వడపోత ప్రక్రియ పూర్తయిన అనంతరం జాబితాను ఖరారు చేశారు.
అర్హులైన వారికి కార్డులు మంజూరు:
రాష్ట్రంలో గత కొంత కాలంగా రేషన్ కార్డుల మంజూరు నిలిచిపోయిన నేపథ్యంలో.. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ అంశంపై దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఒక కేబినెట్ సబ్-కమిటీని ఏర్పాటు చేసి.. కొత్త రేషన్ కార్డుల జారీ విధానం, అర్హత ప్రమాణాలను పునర్ నిర్ణయించేందుకు సూచనలు కోరింది. కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ప్రజాపాలన కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులతోపాటు.. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి అర్హులైన వారికి కార్డులు మంజూరు చేయబోతున్నది.
ఇది కూడా చదవండి: భద్రం బీకేర్ఫుల్.. గుండె ఆరోగ్యం కోసం పంచ రత్నాల వంటి అలవాట్లను తెలుసుకోండి.
ఈసారి ప్రభుత్వం అత్యాధునిక టెక్నాలజీని వినియోగించడానికి ముందుకొచ్చింది. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డులను స్మార్ట్ ఫార్మాట్‌లో రూపొందించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్మార్ట్ కార్డుల నమూనా రూపకల్పన తుది దశకు చేరుకున్నది. ఏటీఎం కార్డు పరిమాణంలో ఉండే ఈ కార్డులపై ఒక వైపు ముఖ్యమంత్రి ఫోటో, మరోవైపు పౌర సరఫరాల శాఖ మంత్రిపై ఫోటోతోపాటు మధ్యలో తెలంగాణ ప్రభుత్వ అధికార లోగో ఉండనుంది. ఈ స్మార్ట్ కార్డులు బార్ కోడ్‌తో ఉంటాయి. కార్డు స్కాన్ చేయగానే లబ్ధిదారుల వివరాలు త్వరగా అందుబాటులోకి వచ్చేందుకు వీలుగా సాంకేతిక రూపకల్పన చేపట్టారు. దీనివల్ల రేషన్ సరఫరాలో పారదర్శకత పెరిగి.. దుర్వినియోగాన్ని నివారించేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇకపై అర్హులెవరైనా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే వీలుంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలో రేషన్ విధానంలో ఒక పెద్ద మార్పుగా భావించవచ్చు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో విషాదం... కన్నబిడ్డల కోసం పోరాడిన ఓ తండ్రి విషాదగాథ
( ts-news | Latest News | telugu-news | ration-cards | tg )