/rtv/media/media_files/2025/07/01/pashamylaram-fire-accident-2025-07-01-07-42-56.jpg)
Pashamylaram Fire Accident
Pashamylaram Fire Accident: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో మృతుల సంఖ్య 33కు చేరింది. ఈ మృతదేహాలను వెలికితీయగా శిథిలాల కింద మరికొందరు చిక్కుకొన్నారని, మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రమాద తీవ్రతకు పరిశ్రమ భవనంలో 14 అంగుళాల మందంతో ఉన్న ప్లింత్‌బీమ్‌లు విరిగి, కుప్ప కూలిపోవడంతో నష్టతీవ్రత పెరిగిందని వెల్లడించారు.
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
50 మీటర్లు ఎగిరిపడిన మృతదేహం..
పరిశ్రమ వైస్ ప్రెసిడెంట్ ఇలంగోవన్ క్వాలిటీ కంట్రోల్ విభాగం నుంచి కిందికి దిగుతున్న సమయంలోనే పేలుడు జరగింది. దీంతో ఆయన మృతదేహం 50 మీటర్ల దూరం ఎగిరి పడింది. ఘటనపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు... మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వివేక్‌ల ఆధ్వర్యంలో ఎన్డీఆర్‌ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
ఇక పేలేడుకు కారణం.. బ్లో ఎయిర్ హ్యాండ్లర్‌ను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యమేనని అంచనా వేస్తున్నారు. అందులో దుమ్ము పేరుకుందని, అందుకే డ్రయ్యర్‌లో ఉష్ణోగ్రత అదుపులోకి రాకపోవడంతో పేలుడుకు దారితీసి ఉంటుందని ఓ సీనియర్ అధికారి చెబుతున్నారు.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం