BIG BREAKING: వల్లభనేని వంశీకి బెయిల్.. రేపే విడుదల!

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్‌ లభించింది. నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో రేపు జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. 

New Update
Vallabhaneni Vamshi

Vallabhaneni Vamshi

నకిలీ ఇళ్ల పట్టాల కేసులో వల్లభనేని వంశీకి బెయిల్‌ లభించింది. నూజివీడు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటివరకు వంశీపై నమోదైన అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో రేపు విజయవాడ జిల్లా జైలు నుంచి వంశీ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 13న ఏపీ పోలీసులు వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. వ్యక్తిని కిడ్నాప్ చేయడంతో పాటు, టీడీపీ ఆఫీస్ పై దాడి, నకిలీ ఇళ్ల పట్టాలు తదితర కేసులు వంశీపై ఉన్నాయి. గత నెలలోనే రెండు కేసుల్లో వంశీకి బెయిల్ రాగా.. తాజాగా నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనకు బెయిల్ లభించింది. దీంతో వంశీ విడుదల కానున్నారు.

Also Read :  వ్యక్తిత్వ వికాస నిపుణులు బి.వి.పట్టాభిరామ్ కన్నుమూత!

Also Read :  నటి పాకీజాను ఆదుకున్న డిప్యూటీ సీఎం పవన్ !

Also Read :  విజయవాడ దుర్గమ్మకు.. తెలంగాణ ‘మహాకాళి’ బోనం సమర్పణ

విడుదల తర్వాత ఆస్పత్రికి..

మొత్తం 138 రోజుల పాటు వంశీ జైలు జీవితం గడిపారు. ఈ క్రమంలో అనేక సార్లు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. చికిత్స తర్వాత కొన్ని రోజుల పాటు వంశీ హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెబుతున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మళ్లీ పాలిటిక్స్ లో యాక్టీవ్ అవుతారని వారు అంటున్నారు. 

Also Read :  పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్‌ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?

 

vallabhaneni vamsi health | vallabhaneni-vamshi | telugu-news | telugu breaking news

Advertisment
Advertisment
తాజా కథనాలు