Thammudu Trailer: హీరో నితిన్ లేటెస్ట్ మూవీ తమ్ముడు ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. ఫుల్ యాక్షన్, ఎమోషన్స్ తో సాగిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అక్క అనే పిలుపు కోసం ఎంతటి సాహసానికైనా సిద్దపడే తమ్ముడి కథే ఈ సినిమా. ఒకరికొకరు ప్రాణంగా బతికిన అక్కాతమ్ముళ్లు ఎందుకు దూరమయ్యారు? తమ్ముడి పై అక్క కోపానికి గల కారణాలేంటి? అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నితిన్ తమ్ముడి పాత్రలో నటించగా, సీనియర్ నటి లయ అక్క పాత్రను పోషించింది. చాలా కాలం తర్వాత లయ ఈ సినిమాతో మళ్ళీ తెరపై కనిపించనుంది.
Also Read: Shefali Jariwala: షఫాలీ కేసులో బిగ్ ట్విస్ట్.. బెడ్ రూమ్‌లో ఆ టాబ్లెట్ గుర్తించిన పోలీసులు!
Aiming for the Bullseye 🎯#Thammudu Release Trailer Tomorrow at 6:00PM...!#VibeOfThammudu #ThammuduOnJuly4th pic.twitter.com/ThWkyodnWz
— nithiin (@actor_nithiin) June 29, 2025
జులై 4న విడుదల..
"కాంతార" ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ నితిన్ సరసన హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సౌరభ్ సచ్‌దేవా, స్వాసిక, హరి తేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దిల్ రాజు సమర్పణలో వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా జూలై 4న థియేటర్లలోకి రానుంది. ట్రైలర్ చూసిన తర్వాత 'తమ్ముడు' నితిన్ కి మంచి హిట్ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ కూడా సూపర్ రెస్పాన్స్ పొందాయి. అజినీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే 'భీష్మ' సినిమా తర్వాత గత నాలుగేళ్లుగా నితిన్ కి సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో ఈ సినిమా నితిన్ కి మంచి కమ్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.
Also Read: Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు