/rtv/media/media_files/2025/07/01/bv-pattabhiram-passed-away-2025-07-01-16-30-03.jpg)
BV Pattabhiram passed away
B.V. Pattabhiram: ప్రముఖ పర్సనాలిటీ డెవెలప్మెంట్ నిపుణులు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. హిప్నాటిస్టు, మెజీషియన్ గా కూడా ఆయన ప్రసిద్ధి చెందారు. హిప్నోసిస్ పై ఆయన కృషికి గుర్తింపుగా 1983లో ఫ్లోరిడా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ప్రధానం చేసింది. పట్టాభిరామ్ విద్యార్థుల కోసం స్పెషల్ క్లాసెస్ నిర్వహింంచడంతో పాటు, తల్లిదండ్రుల అవగాహనా సదస్సుసులు నిర్వహించారు. అలాగే దూరదర్శన్ లో అనేక మేజిక్ షోలు నిర్వహించారు.
Also Read: Mangli Photos: మంగ్లీ బోనాల స్పెషల్.. అమ్మవారిలా ఎంత బాగుందో! ఫొటోలు చూశారా
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్(75) కన్నుమూత..
— Telugu Stride (@TeluguStride) July 1, 2025
హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూసిన బీవీ పట్టాభిరామ్.. ఇంద్రజాలికుడు, మానసిక వైద్యుడిగా బీవీ పట్టాభిరామ్ ప్రసిద్ధి.. ప్రముఖ హిప్నాటిస్టుగానూ పేరుగాంచిన బీవీ పట్టాభిరామ్..#BVpattabhiram #Hyderabad pic.twitter.com/X4iUyDNj0u
Also Read : గుండెపోటా లేక గుండె ఆగిందా.. అంటారు. అసలు వీటి అర్థమేంటి..!!?
ఉస్మానియా విశ్వవిద్యాలయం
బి.వి.పట్టాభిరాం ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి PhD పట్టా పొందారు. ఆ తరువాత సైకాలజీ, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి కోర్సుల్లో స్నాతకోత్తర పట్టా అందుకున్నారు. జర్నలిజంలో పీజీ డిప్లమా, గైడెన్స్, కౌన్సిలింగ్ పూర్తి చేసాడు. అలాగే మానసిక శాస్త్రం, ఫిలాసఫీ గైడెన్స్ కౌన్సెలింగ్, హిప్నోథెరపీ వంటి కోర్సుల్లో అమెరికా నుంచి పోస్ట్‌గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు.
Also Read: Kannappa Piracy: మంచు విష్ణు 'కన్నప్ప' కు పైరసీ దెబ్బ.. వేల సంఖ్యల్లో ఆన్ లైన్ లింకులు
Also Read : ఇదేం పిచ్చిరా బాబు.. స్కూటీ ధర రూ.1లక్ష.. నంబర్ ప్లేట్ రూ.14 లక్షలు