JOBS: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,208 పోస్టులతో భారీ నోటిఫికేషన్!

బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

New Update
jobs

JOBS: బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని కలలు కంటున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,208 ప్రొబెషనరీ ఆఫీసర్ (PO) / మేనేజ్‌మెంట్ ట్రైనీ (MT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS)  ద్వారా ఈ నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ పోస్టుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బ్యాంకుల్లో స్థిరమైన, గౌరవప్రదమైన కెరీర్‌ను నిర్మించుకోవచ్చు.

నోటిఫికేషన్ వివరాలు.. 

  • పోస్టుల సంఖ్య: 5,208
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • అప్లికేషన్ ప్రారంభ తేదీ: 1/07/2025
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఈ నెల 21వ తేదీ వరకు
  • వయో సడలింపు: రిజర్వేషన్ల ఆధారంగా వయో సడలింపు వర్తిస్తుంది.

ఎంపిక ప్రక్రియ:

  • ప్రిలిమినరీ పరీక్ష (Preliminary Exam): ప్రిలిమ్స్ పరీక్ష అనేది ప్రాథమిక దశ. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారే తదుపరి దశకు వెళ్తారు. ఈ పరీక్షలు ఆగస్టు 2025లో నిర్వహించబడతాయి.

  • మెయిన్ ఎగ్జామ్ (Main Exam): ప్రిలిమ్స్ లో ఉతీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు అర్హులు అవుతారు. ఈ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులను ఇంటర్వ్యూకు సెలెక్ట్  చేయడం జరుగుతుంది. మెయిన్స్ ఎగ్జామ్స్ అక్టోబర్ 2025లో నిర్వహించబడతాయి.

  • ఇంటర్వ్యూ (Interview): మెయిన్స్ లో ఉత్తీర్ణులైన వారిని పర్సనల్ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి వ్యక్తిత్వం, బ్యాంకింగ్ రంగంపై అవగాహన వంటివి పరీక్షిస్తారు.

అభ్యర్థుల (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు తదితర వర్గాలకు) రిజర్వేషన్లు  వర్తిస్తాయి. అలాగే రిజర్వేషన్ల ఆధారంగా వయసు సడలింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Advertisment
Advertisment
తాజా కథనాలు