/rtv/media/media_files/2025/07/01/dwcra-womens-2025-07-01-08-15-31.jpg)
Dwcra Womens good news
Dwcra Womens : డ్వాక్రా మహిళలకు మరింత ప్రయోజనం కలిపించే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వారికోసం 'డీజీ లక్ష్మి' అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 250 రకాల సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. డ్వాక్రా మహిళలు నిర్వహించేందుకు వీలుగా 9,034 కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ-సాధారణ సేవా కేంద్రాలు) ను ఏర్పాటు చేయనున్నారు.దానికి అవసరమైన శిక్షణ కోసం ప్రభుత్వం రూ.23.84 కోట్లు కేటాయించింది. ఈ పథకం మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచడానికి ఉపకరిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read: జూలై 1వ తేదీ నుంచి మారనున్న రూల్స్ ఇవే!
కామన్ సర్వీస్ సెంటర్లను స్వయం సహాయక సంఘాల సభ్యులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు ఈ సీఎస్‌సీ సెంట్లర్ల నిర్వహణకు అర్హులైన సభ్యులను ఎంపిక చేయాలని మెప్మాకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సీఎస్‌సీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ-సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల పౌరసేవల్ని ప్రజలు పొందవచ్చు. ఈ సెంటర్ల వల్ల ప్రజలకు సేవలు అందడంతో పాటు మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read: పేద ఖైదీలకు కేంద్రం గుడ్‌న్యూస్.. బెయిల్‌కు ఆర్థిక సాయం
అయితే ఈ పథకానికి ఎంపికయ్యే మహిళలకు ప్రభుత్వం కొన్ని అర్హతలు సూచించింది.'స్వయం సహాయక సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి. 21 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలని సూచించింది. వివాహం అయి ఉండాలి.. సంబంధిత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివాసి అయి ఉండాలి. కనీస విద్యార్హత డిగ్రీగా నిర్ధేశించింది. స్మార్ట్ ఫోన్ ఉండటం తప్పనిసరి. ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి రూ.2.50 లక్షల వరకు రుణం (కియోస్క్, ఇతర సదుపాయాల కల్పనకు) ఇస్తారు. ఈ పథకం ద్వారా మహిళలకు మరింత ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యమని అధికారులు వెల్లడించారు.
Also Read: యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?