Psycho Husband : అమెరికాలో సైకో మొగుడు...భార్యపిల్లల్ని వదిలి ఇండియాకు..

అమెరికాలో భార్యపిల్లల్ని హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న ఒక సైకో మొగుడి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఆ సైకో చేతిలో చిత్రహింసలకు గురైన భార్య పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడే వదిలేసి ఇండియాకు రావడంతో వారు ఇబ్బంది పడుతున్నారు.

New Update
Psycho Husband in America

Psycho Husband in America

Psycho Husband : అమెరికాలో భార్యపిల్లల్ని హింసిస్తూ రాక్షస ఆనందం పొందుతున్న ఒక సైకో మొగుడి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఆ సైకో చేతిలో చిత్రహింసలకు గురైన భార్య పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడే వదిలేసి ఇండియాకు రావడంతో వారు అమెరికాలో ఉండలేక, ఇండియాకు రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం....

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య


ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రస్తుత జనగామా జిల్లాకు చెందిన బొడ్డు సుమకు 2006లో హైదరాబాద్‌కి చెందిన అరవింద్‌తో వివాహం జరిగింది. అనంతరం వీరు 2008లో అమెరికాకు వెళ్లారు. కొంతకాలం బాగానే ఉన్న అరవింద్‌ పిల్లలు పుట్టాక సైకోల ప్రవర్తించడం మొదలు పెట్టాడు. భార్య పిల్లల్ని హింసిస్తూ రాక్షస అనందం పొందుతున్నాడు. ఈ మధ్య ఈ పైశాసిక ఆనందం తారస్థాయికి చేరింది. ఈ క్రమంలో పిల్లల్ని విపరీతంగా కొట్టడంతో అరవింద్‌ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని వదిలేశారు. 

Also Read: 10 ఏళ్ల చిన్నారిపై రేప్.. రక్తంతో ఇంటికెళ్లగా షాకైన తల్లిదండ్రులు - చివరికి!

కాగా తనపై కేసుపెట్టారన్న కోపంతో భార్యపిల్లల్ని అమెరికాలో వదిలేసి హైదరాబాద్‌ చేరుకున్నాడు అరవింద్‌. అప్పటినుంచి సుమతో పాటు పిల్లలు అక్కడే ఉండిపోయారు. డిపెండెంట్‌ వీసా మీద సుమతో పాటు పిల్లలు అమెరికాలో ఉండిపోయారు. అయితే చేతిలో డబ్బులు లేకపోవడంతో సుమకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాగా ఆమె పిల్లలు అమెరికా సిటిజన్‌షిప్‌ కలిగి ఉన్నారు. అయితే వారు అక్కడ ఉండాలంటే  ---అథెంటిక్ జాబ్ కావాలని అమెరికా అధికారులు అడుగుతున్నారు. సహాయం చేసేవారు లేకపోవడంతో సుమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని సుమ ఆర్టీవీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Also read: తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావం...దంచికొడుతున్న వర్షం

Advertisment
Advertisment
తాజా కథనాలు