/rtv/media/media_files/2025/07/01/road-accident-2025-07-01-09-50-55.jpg)
Road Accident
Road Accident: బాలానగర్ పైవంతెనపై రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఓ పోలీస్ అధికారి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఈ ఘటన పై పోలీసులు కేసులు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలానగర్ ఫ్లైఓవర్ పై నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు.
ఇది కూడా చూడండి: Anchor Swetcha : యాంకర్ స్వేచ్ఛ కేసులో బిగ్‌ట్విస్ట్...ఆమె మరణానికి పూర్ణనే కారణం..?
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు మొదలు పెట్టారు. మృతుని వివరాలు నమోదు చేస్తుండగా వేగంగా వచ్చిన డీసీఎం వాహనం.. ఎస్ఐ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ వెంకటేశంకు తీవ్రగాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు, డీసీఎం డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత