Telangana: 2 నెలల క్రితమే పెళ్లి.. పాశమైలారం ఘటనలో నవ దంపతుల మృతి

పాశమైలారం ప్రమాద ఘటనలో మరో కీలక విషయం బయటపడింది. రెండు నెలల క్రితమే పెళ్లయిన నవ దంపతులు మృతి చెందడం కలకలం రేపింది. సిగాచి కంపెనీలో పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన నిఖిల్‌ రెడ్డి, శ్రీరమ్య అనే నవదంపతులు ఈ ప్రమాదంలో మరణించారు.

New Update
Newly Married Couple Dead in Sangareddy Chemical Blast

Newly Married Couple Dead in Sangareddy Chemical Blast

సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. సిగాచీ కెమికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇప్పటిదాకా 42కు చేరింది. ఆస్పత్రిలో 35 మందికి చికిత్స జరుగుతోంది. అయితే ఈ ఘటనపై మరో కీలక విషయం బయటపడింది. ఈ ప్రమాదంలో రెండు నెలల క్రితమే పెళ్లయిన నవ దంపతులు మృతి చెందడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన నిఖిల్‌ రెడ్డికి.. అదే జిల్లాకు చెందిన శ్రీరమ్య అనే యువతితో ప్రేమ వివాహం జరిగింది. 

Also Read: మూడేళ్లుగా సహజీవనం.. ప్రియురాలని చంపి.. మృతదేహంతోనే రెండ్రోజులు

సిగాచీ పరిశ్రమలోనే వీళ్లు పనిచేస్తున్నారు. రియాక్టర్‌ పేలిన సమయంలో వాళ్లు అక్కడే ఉండటంతో ఈ ప్రమాదంలో దంపతులిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. దీంతో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  ఇదిలాఉండగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మ-ృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పరిహారం ఇప్పించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

Also Read: వైద్య రంగంలో సంచలనం.. శాటిలైట్ సాయంతో 5,000 కిలోమీటర్ల దూరం నుంచి సర్జరీ

 

Advertisment
Advertisment
తాజా కథనాలు