/rtv/media/media_files/2025/07/01/father-killed-his-son-with-wood-in-ntr-district-2025-07-01-14-48-09.jpg)
father killed his son with wood in NTR district
రోజు రోజుకూ మరణాల సంఖ్య పెరిగిపోతుంది. క్షణకావేశంలో కొందరు కన్న వారినే కడతేర్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొడుకుని కన్న తండ్రి చెక్క ముక్కతో కొట్టి హతమార్చాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్‌పేట గ్రామంలో జరిగింది.
Also Read: పక్క రాష్ట్రాల్లోని ఫోన్లూ ట్యాప్ చేయచ్చు..కానీ ఎట్లనో తెలుసా?
కొడుకును చంపిన తండ్రి
వెంకటనారాయణ (35)కు 15 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఒక కుమారుడు, కుమార్తె సతానం. 5 ఏళ్ల క్రితం భార్య.. వెంకటనారాయణను వదిలేసి వెళ్లిపోయింది. అప్పటి నుంచి అతడు తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి బాగా బానిసయ్యాడు.
Also Read: అది జరిగితే మరుసటిరోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తా: ఎలాన్ మస్క్
రోజు ఫుల్‌గా తాగొచ్చి తల్లిదండ్రులతో గొడవ పడేవాడు. ప్రశ్నించినందుకు కన్న తల్లిదండ్రులనే కొట్టేవాడు. ఈ వ్యవహారం తరచూ జరిగేది. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి ఫుల్‌గా తాగొచ్చిన వెంకటనారాయణ.. మళ్లీ తల్లిదండ్రులతో గొడవపడ్డాడు.
Also Read : బీజేపీ అధ్యక్ష పదవి మిస్.. ఎంపీ ఈటల ఫస్ట్ రియాక్షన్!
ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి గోళ్ల కృష్ణ.. పక్కనే ఉన్న చెక్క మొద్దుతో తన కొడుకు వెంకటనారాయణ తలపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత
ap-crime-news | Latest crime news | crime news