RS 14 Lakh VIP Number Plate: ఇదేం పిచ్చిరా బాబు.. స్కూటీ ధర రూ.1లక్ష.. నంబర్ ప్లేట్ రూ.14 లక్షలు

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి VIP రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశాడు. ఆ స్కూటీ ధర కేవలం రూ.1లక్ష మాత్రమే కావడం విశేషం. అతడు ఇంత డబ్బు పెట్టి ‘HP 21 C 0001’ అనే నెంబర్ ప్లేట్‌ను కొన్నాడు.

New Update
Himachal Pradesh Man spent rs14 lakh VIP number plate for Honda Activa scooter

Himachal Pradesh Man spent rs14 lakh VIP number plate for Honda Activa scooter

చాలా మంది కారు ఓనర్స్ తమ కారు కొనే ధర కంటే.. దాని నెంబర్ ప్లేట్‌కే ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇప్పటి వరకు ఇలాంటివి చాలానే విన్నాం. కారు ధర రూ.15లక్షలు ఉంటే.. దాని నెంబర్ ప్లేట్‌కు దాదాపు రూ.40లక్షలు ఖర్చుచేసిన వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా అలాంటిదే మరొకటి జరిగింది. ఓ వ్యక్తి రూ.1 లక్ష ధర గల స్కూటీ నెంబర్ ప్లేట్‌కు రూ.14 లక్షలు ఖర్చు చేశాడు. ఈ విషయం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read :  గుండెపోటా లేక గుండె ఆగిందా.. అంటారు. అసలు వీటి అర్థమేంటి..!!?

Himachal Pradesh

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ సమీపంలోని మట్టన్ సిద్ధ్‌కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఒక హార్డ్‌వేర్ & ఐరన్ వ్యాపారి. అతడు హోండా యాక్టివా స్కూటర్‌కు VIP రిజిస్ట్రేషన్ నంబర్ కోసం రూ.14 లక్షలు ఖర్చు చేశాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆ స్కూటీ ధర కేవలం రూ.1లక్ష మాత్రమే. అతడు ఇంత డబ్బు పెట్టి ‘‘HP 21 C 0001’’ అనే నెంబర్ ప్లేట్‌ను ఆన్‌లైన్ వేలం ద్వారా కొనుగోలు చేశాడు. 

Also Read :  ప్రభాస్ "రాజా సాబ్" లో భారీ సర్ ప్రైజ్! ఐటమ్ నెంబర్ కోసం స్టార్ హీరోయిన్ రంగంలోకి

Also Read :  ఈటల రాజేందర్‌కు BJP అధ్యక్ష పదవి ఇందుకే ఇవ్వలేదు.. కారణం కవిత, కాళేశ్వరమే

దీని బట్టి చూస్తే కొనుగోలు ధర స్కూటర్ విలువ కంటే 14 రెట్లు ఎక్కువగా ఉంది.  అంతేకాకుండా హిమాచల్ ప్రదేశ్‌లో ద్విచక్ర వాహనం కోసం చెల్లించిన అత్యధిక రిజిస్ట్రేషన్ అమౌంట్ ఇదేనని అధికారులు తెలిపారు. ఈ నెంబర్ ప్లేట్‌ను సొంతం చేసుకున్న అంనంతరం సంజీవ్ కుమార్, అతని కుమారుడు దినేష్ కుమార్ ఫ్యాన్సీ నంబర్ ప్లేట్‌‌ను సొంతం చేసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. తన అభిరుచి కారణంగా తాను VIP నంబర్ తీసుకున్నానని తెలిపాడు. ఈ నంబర్ కోసం తాను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నానని చెప్పాడు. 

Also Read :  ముంచుకొచ్చిన కార్చిచ్చు మంటలు.. 50వేల మంది..

scooty offers | viral-videos | viral-news

Advertisment
తాజా కథనాలు