-
Dec 13, 2024 21:21 IST
కోర్టు బెయిల్ ఇచ్చినా.. కోర్టులోనే అల్లు అర్జున్..!
అల్లు అర్జున్ రిలీజ్ మరింత ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ బన్నీ రిలీజ్ కాకపోవచ్చని అధికారులు అంటున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ జైలు అధికారులకు ఇంకా చేరలేదని సమాచారం. దీంతో ఇవాల చంచల్‌గూడ జైలులోనే బన్నీ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : https://rtvlive.com/cinema/allu-arjun-to-stay-in-chanchalguda-jail-today-night-8438681
-
Dec 13, 2024 21:06 IST
మేము దురుసుగా ప్రవర్తించలేదు – సెంట్రల్ జోన్ డీసీపీ
అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్. ఆయన బట్టలు మార్చుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి బయటకు వచ్చాకనే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
-
Dec 13, 2024 20:52 IST
అప్పుడు షారుక్ ఖాన్, ఇప్పుడు అల్లు అర్జున్.. ఇద్దరి కేసులు ఒకటే!
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. గతంలో షారుఖ్ ఖాన్ కూడా ఓ మూవీ ప్రమోషన్స్ కోసం వడోదర రైల్వే స్టేషన్‌కు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఒకరు మరణించడంతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయనకు ఊరట లభించింది.
Also Read : https://rtvlive.com/cinema/allu-arjun-sandhya-theatre-case-and-shah-rukh-khan-vadodara-case-8438599
-
Dec 13, 2024 19:12 IST
జైలు నుంచి విడుదలైన అల్లు అర్జున్
-
Dec 13, 2024 19:03 IST
నేను నమ్మలేకపోతున్నా–రష్మిక
అసలేం జరుగుతోంది నేను నమ్మలేక పోతున్నా. ఈ మొత్తం సంఘటన నా హృదయాన్ని ముక్కలు చేసింది అంటూ అల్లు అర్జున్ అరెస్ట్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రియాక్ట్ అయ్యారు. ఒక్క వ్యక్తిని బలి చేయడం అన్యాయం అంటూ వాపోయారు.
Also Read : https://rtvlive.com/cinema/heroin-rashmika-reaction-on-allu-arjun-arrest-8438178
-
Dec 13, 2024 18:33 IST
అల్లు అర్జున్ అరెస్ట్‌కి ముందు టైం టు టైం ఏం జరిగిందంటే..?
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే పోలీసులు బన్నీని అదుపులోకి తీసుకున్న టైం నుంచి నాంపల్లి కోర్టులో హాజరుపరచిన వరకు టైం టు టైం అప్డేట్స్ ఇక్కడ ఉన్నాయి.
Also Read : https://rtvlive.com/cinema/time-to-time-updates-before-allu-arjun-arrest-8437914
-
Dec 13, 2024 18:13 IST
అల్లు అర్జున్ అరెస్టుపై వై ఎస్ జగన్ సంచలన ట్వీట్..
అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిదన్నారు. ఇందులో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదన్నారు.
Also Read : https://rtvlive.com/cinema/ys-jagan-sensational-tweet-on-allu-arjun-arrest-8438081
-
Dec 13, 2024 17:55 IST
అల్లు అర్జున్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్..
అల్లు అర్జున్‌కు హైకోర్టులో భారీ ఊరట దక్కింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని హైకోర్టు తెలిపింది. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
Also Read : https://rtvlive.com/cinema/allu-arjun-gets-relief-from-the-high-court-8437920
-
Dec 13, 2024 17:12 IST
నాంపల్లి కోర్టు.....
అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యుడిషియల్ రీమాండ్ విధించిన నాంపల్లి కోర్టు.. నాంపల్లి కోర్టు నుండి చంచల్ గూడ జైలు కు తరలించనున్న పోలీసులు.
-
Dec 13, 2024 17:11 IST
ఈనెల 27 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పించిన నాంపల్లి కోర్టు
-
Dec 13, 2024 17:11 IST
లోయర్ కోర్టు లో రిమాండ్ విధించిన హై కోర్టు కు మధ్యంతర బెయిల్ ఇచ్చే అధికారం ఉందన్న నిరంజన్ రెడ్డి
-
Dec 13, 2024 17:11 IST
హై కోర్టు లో మధ్యంతర బెయిల్ కు అప్లై
-
Dec 13, 2024 16:56 IST
అలా అయితే సగం మంది రాజకీయ నాయకులు జైలుకే! బ్రహ్మాజీ సంచలన వ్యాఖ్యలు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం పై నటుడు బ్రహ్మాజీ మండిపడ్డారు. "దేశంలో చాలా చోట్ల తొక్కిసలాట జరిగింది. ఎవరినైనా అరెస్ట్ చేశారా..? అలా చేస్తే సగం మంది రాజకీయ నాయకులు జైలుకు వెళ్తారు" అంటూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
Also Read : https://rtvlive.com/cinema/actor-brahmaji-responds-on-allu-arjun-arrest-telugu-news-8437917
-
Dec 13, 2024 16:19 IST
అల్లు అర్జున్‌కు 14 రోజుల రిమాండ్ - నాంపల్లి కోర్టు
-
Dec 13, 2024 16:18 IST
మోహన్ బాబుకు తెలంగాణ కోర్టు బిగ్ షాక్!
-
Dec 13, 2024 16:10 IST
మోదీ సర్కార్‌కు సవాళ్లు.. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమవుతుందా ?
కేంద్ర కేబినెట్ జమిలి ఎన్నికల బిల్లుకు గురువారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. వచ్చేవారమే ఈ బిల్లును ప్రవేశపెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
Also Read : https://rtvlive.com/national/union-cabinet-clears-one-nation-one-election-bill-full-story-8437668
-
Dec 13, 2024 15:14 IST
బన్నీకి పదేళ్ల జైలు శిక్ష తప్పదా.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ!
టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 'పుష్ప2' సినిమా సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మహిళా అభిమాని మృతి కేసులో బన్నీని అరెస్ట్ చేశారు. బన్నీకి పదేళ్ల శిక్షపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : https://rtvlive.com/telangana/allu-arjun-was-sentenced-to-ten-years-in-prison-telugu-news-8437590
-
Dec 13, 2024 15:01 IST
భార్యల వేధింపులకు భర్తలు బలి.. ఎన్ని ఘోరాలు జరిగాయంటే?
భార్య బాధితులు పెరిగిపోవడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేవలం భార్యల వేదనలను మాత్రమే కోర్టులు వింటాయా? భర్తలు పడుతున్న ఆవేదనలను కోర్టులు పట్టించుకోవా? మహిళలకే ఎందుకు ప్రత్యేక చట్టాలు? పురుషుల గోడు వినేదెవరు? ఇంట్రెస్టింగ్ స్టోరీపై ఓ లుక్కేయండి.
Also Read : https://rtvlive.com/lifestyle/many-men-have-died-from-abuse-by-their-wives-8437485
-
Dec 13, 2024 14:12 IST
బన్నీకి మద్ధతుగా కేటీఆర్.. పోస్ట్ వైరల్!
అల్లు అర్జున్ అరెస్టును కేటీఆర్ ఖండించారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్‌ను అరెస్ట్ చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read : https://rtvlive.com/telangana/ktr-condemned-allu-arjun-arrest-telugu-news-8437431
-
Dec 13, 2024 13:33 IST
బెడ్‌రూమ్‌లోంచి బలవంతంగా లాకొచ్చారు.. మీడియాతో బన్నీ!
సంథ్య థియేటర్ ఇష్యూలో పోలీసులు అరెస్ట్ చేయడంపై నటుడు అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేశాడు. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే అరెస్టు చేశారన్నాడు. బెడ్ రూమ్ లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారని, కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.
https://rtvlive.com/telangana/allu-arjun-react-on-police-arrest-telugu-news-8437331
-
Dec 13, 2024 12:40 IST
BIG BREAKING: అల్లు అర్జున్ అరెస్ట్
సంథ్య థియేటర్ ఘటనలో అల్జు అర్జున్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం
-
Dec 13, 2024 11:37 IST
వైసీపీ నేత దేవినేని అవినాష్ అరెస్ట్
రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బయలు దేరిన వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను పోలీసులు నడిరోడ్డుపై అరెస్టు చేశారు. పోలీసులు ఇలా అరెస్టు చేయడంతో వారి తీరును అవినాష్ తప్పుబట్టాడు. రైతులకు అండగా ఉండటం కూడా తప్పేనా? అని పోలీసులను నిలదీశారు.
https://rtvlive.com/politics/ycp-leader-devineni-avinash-arrested-by-police-ind-road-side-8436958
-
Dec 13, 2024 11:16 IST
RBI గవర్నర్‌కు బాంబు బెదిరింపులు
రిజ్వర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పేల్చేస్తామంటూ గవర్నర్‌కు ఈ-మెయిల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు రష్యన్ భాషలో గవర్నర్‌కు మెయిల్ చేశారు. దీంతో అధికారులు అలర్ట్ అయ్యి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మెయిల్ చేసిన వ్యక్తి కోసం విచారణ చేపట్టారు.
-
Dec 13, 2024 11:08 IST
Manchu Manoj: మద్యం మత్తులో మంచు మనోజ్ గొడవ?
మంచు మనోజ్‌కు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వైరల్ అవుతుంది.ఆయన ఎవరో ఓ వ్యక్తితో తీవ్రంగా ఘర్షణ పడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఆ వీడియో చూసిన వారు కొందరు అందులో మనోజ్ తాగి ఉన్నాడని ఆరోపిస్తున్నారు.ఆయనని ఆపడానికి మోహన్ బాబు ప్రయత్నిస్తున్నట్లు కనపడుతుంది.
https://rtvlive.com/cinema/viral-video-manchu-manoj-manchu-mohanbabu-8436835
-
Dec 13, 2024 10:59 IST
బోడుప్పల్లో భారీ గంజాయి చాక్లెట్ల పట్టివేత.. బీహార్ నుంచి తెప్పించి..
హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. ఓ బడ్డీ కొట్టులో ఒక్కో గంజాయి చాక్లెట్లు రూ.15 చొప్పున విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితులు బీహార్‌కి చెందిన వీరేంధ్రబూ నుంచి గంజాయి చాక్లెట్లు స్వాధీనం.
-
Dec 13, 2024 10:29 IST
హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అరెస్టు
హైదరాబాద్ మోస్ట్ వాంటెడ్ గంజాయి లేడీ డాన్ అంగూర్ బాయ్‌ను ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఓసారి జైలుకు వెళ్లి వచ్చిన ఈమె దూల్‌పేట్‌కే గంజాయి డాన్‌గా పేరు తెచ్చుకుంది. పదికి పైగా కేసులు ఈమెపై ఉన్నా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది.
-
Dec 13, 2024 10:16 IST
Mohan Babu: అయామ్ సారీ..మీడియాకి మోహన్ బాబు క్షమాపణలు!
కొద్ది రోజులుగా మంచు వారి కుటుంబంలో వివాదాలు నడుస్తున్నాయి.ఈ క్రమంలోనే మోహన్ బాబు ఆవేశంతో టీవీ 9 జర్నలిస్ట్ మీద దాడి చేశారు.తాజాగా ఆయన ఈ దాడి గురించి స్పందించారు. టీవీ9కి, జర్నలిస్ట్‌లకు క్షమాపణలు తెలుపుతూ ఓ లేఖను విడుదల చేశారు.
https://rtvlive.com/cinema/mohan-babu-apologized-to-the-media-8436658
-
Dec 13, 2024 10:02 IST
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు
భూదాన్ భూముల స్కామ్‌లో నాగర్ కర్నూలు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇతనితో పాటు సుబ్బారెడ్డి, సూర్య తేజ, సిద్దారెడ్డికి కూడా నోటీసులు పంపింది. డిసెంబర్ 16న విచారణకు హాజరు కావాలని తెలిపింది.
-
Dec 13, 2024 10:01 IST
Doctor Suicide: నిన్న టెకీ..నేడు డాక్టర్..రెండు ఒకటే!
రాజస్థాన్‌లో హోమియోపతి డాక్టర్ అజయ్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు మరోసారి సంచలనంగా మారింది. అయితే అతడు రాసిన సూసైడ్ లేఖలో తన భార్య చిత్ర హింసలు పెడుతుందని ప్రస్తావించడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
-
Dec 13, 2024 09:26 IST
BREAKING: భాగ్యనగర్‌లో త్రిబుల్ మర్డర్ కలకలం
బేగంబజార్‌ని తొఫ్ఖానాలో సిరాజ్ అనే వ్యక్తి, భార్యను గొంతు కోసి, కుమారుని గొంతు నులిమి చంపి, తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో కుమారుడు భయాందోళనకు గురై తప్పించుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది.
https://rtvlive.com/telangana/hyderabad-triple-murder-in-begambazar-telugu-news-8436602
-
Dec 13, 2024 09:10 IST
BREAKING: కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం
ఫార్ములా- ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు గవర్నర్ ఆమోదం లభించినట్లు సమాచారం. దీంతో కేటీఆర్ ఏ క్షణమైన అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
-
Dec 13, 2024 08:35 IST
Joe Biden: ఒక్కరోజే 1500 మందికి శిక్ష తగ్గింపు.. చరిత్ర సృష్టించిన బైడెన్
అమెరికా అధ్యక్షుడు బైడెన్ మరికొన్ని రోజుల్లోనే తన పదవి నుంచి తప్పుకోబోతుండగా.. షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఒక్కరోజులోనే 1500 మందికి శిక్ష తగ్గించారు. అలాగే మొత్తం 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.
-
Dec 13, 2024 06:56 IST
స్కూల్‌కి వెళ్లాలని తల్లి నిద్రలేపితే.. దారుణానికి ఒడిగట్టిన కొడుకు
స్కూల్‌కు వెళ్లేందుకు తల్లి కొడుకును నిద్రలేపడంతో ఆగ్రహానికి గురై ఆమెను హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసకుంది. చెన్నైలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న భర్త ఎన్నిసార్లు కాల్ చేసిన రెస్పాండ్ లేకపోయే సరికి విషయం వెలుగులోకి వచ్చింది.
-
Dec 13, 2024 06:33 IST
తమిళనాడు ప్రైవేటు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం– ఆరుగురు మృతి
తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు ఆసుపత్రికి మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మంటలను అదుపు చేసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బది ప్రయత్నిస్తున్నారు.
https://rtvlive.com/national/fire-accident-in-tamilnadu-private-hospital-8436376
🛑LIVE BREAKINGS: కోర్టు బెయిల్ ఇచ్చినా.. కోర్టులోనే అల్లు అర్జున్..!
New Update
తాజా కథనాలు