/rtv/media/media_files/2024/12/13/sjW8PngLMCGTax1ew1c3.jpg)
అల్లు అర్జున్‌తో తాము దురుసుగా ప్రవర్తించలేదు అని చెప్పారు సెంట్రల్ జోన్ డీసీపీ. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు సమయం ఇచ్చాం. కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అవకాశమిచ్చాం. ఆయన మధ్యలో కాఫీ కూడా తాగారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చాకే అదుపులోకి తీసుకున్నాం. తానే స్వయంగా వచ్చి పోలీసు వాహనంలో కూర్చొన్నారు. ఈ మేరకు డీసీపీ పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. దీంతో పాటూ బన్నీని అరెస్ట్ చేయడానికి గల కారణాలను కూడా వివరించారు డీసీపీ.
మాకు సరైన సమాచారం లేదు..
పుష్ప–2 ప్రీమియర్ కు సంబంధించి బందోబస్తు కోరుతూ అల్లు ర్జున్ టీమ్ ఒక లేఖను సర్పించింది. అయితే వారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో మాత్రమే దాన్ని ఇచ్చారు. భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉన్న లేదా కొంత మంది ప్రముఖ వ్యక్తి సందర్శిస్తున్న నిర్దిష్ట సందర్భాల్లో, ఆర్గనైజర్ వ్యక్తిగతంగా పోలీస్ స్టేషన్ / ACP / DCP కార్యాలయాన్ని సందర్శించి రికవెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ అల్లు అర్జున్ టీమ్ ఏ అధికారినీ కలవలేదు. తాము బందోబస్తు అందజేసే విధానము వారు...సదరు టీమ్ తెలిపిన వివరాలు బట్టే ఉంటుందని డీసీపీ స్పష్టం చేశారు. బన్నీ టీమ్ ఇచ్చిన వివరాల ప్రకారం తాము సంధ్యా థియేటర్ బయట బందోబస్తును ఏర్పాటు చేశాము. హీరో రాక ముందు వరకూ పరిస్థితి అంతా అదుపులోనే ఉంది. కానీ ఆయన వచ్చాక పరిస్థితి మారిపోయింది. దానికి తోడు అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నపపుడు తన కార్ నుంచి బయటకు వచ్చి జనాలను పకలరించారు. దీంతో అందరూగేట్ వైఉకు వెళ్ళడానికి ఉత్సాహం చూపించారు మొత్తం క్రౌడ్ ఒకచోట గుమికూడింది. అప్పుడు అల్లు అర్జున్ టీమ్, బౌన్సర్లు అతని కార్ వెళ్ళడానికి జనాలను తోశారు. అదీకాక హీరో రెండు గంటల పాటూ థియేటర్ దగ్గర ఉన్నారు. దీంతో మొత్తం వ్యవహారం గందరగళంగా మారిపోయింది. తాము ఏర్పాటు చేసిన పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా పరిస్థితి మారలేదు. అప్పుడే తోపులాట జరిగిందని డీసీపీ చెప్పారు.
జనాలు పెద్దగా రావడం చూసి తాము అల్లు అర్జున్‌ను బయటకు వెళ్ళాలని హెచ్చరించామని..కానీ అతను , అతని టీమ్ దానికి పట్టించుకోలేదని డీసీపీ ఆకాంక్షయాదవ్ తెలిపారు. ఇవన్నీ కలసి ఒక మహిళ మరణించింది మరియు ఆమె కుమారుడు సంఘటన జరిగిన 9 రోజుల తర్వాత కూడా వెంటిలేటర్‌పై అపస్మారక స్థితిలో ఉన్నాడని ఆయన చెప్పారు.
Also Read: Varma: దేవుళ్ళను అరెస్ట్ చేస్తారా..అధికారులకు రాంగోపాలవర్మ ప్రశ్న